దిండిగాలకు జన్మదిన శుభాకాంక్షలు

Thu,July 11, 2019 01:30 AM

చుంచుపల్లి : టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్‌కు మండల టీఆర్‌ఎస్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో వారు పాల్గొని ఆయనను సన్మానించారు. శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. టీఆర్‌ఎస్ పార్టీ గిరిజనవిభాగం జిల్లా నాయకులు మూడ్ జయరాం నాయక్, బానోత్ సురేష్, మాలోత్ హరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

కొత్తగూడెం టౌన్ : తెలంగాణ ఉద్యమ కారుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ జన్మదినం సందర్భంగా ఇల్లెందులోని రాజేందర్ నివాసంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం సింగరేణి అధ్యక్షుడు ఎండీ హుస్సేన్ కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్‌తో కలిసి దిగిన చిత్రపటం జ్ఞాపికగా దిండిగాలకు అందించారు. జిల్లాలో గ్రంథాలయాల అభ్యున్నతికి కృషి చేస్తున్న దిండిగాల అంచెలంచెలుగా ఎదగాలని హుస్సేన్ ఆకాంక్షించారు.

టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం టీఆర్‌ఎస్‌వీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాలు, పండ్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజశేఖర్, హుస్సేన్, కార్తీక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles