ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలి

Thu,July 11, 2019 01:30 AM

- టీఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ

పాల్వంచ : రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ అన్నారు. బుధవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రా ప్రాంతానికి చెందిన 1157 మంది స్థానికత కలిగిన విద్యుత్ ఇంజినీర్లను ఆ శాఖ రిలీవ్ చేసిందని, కానీ వారు అక్కడ జాయిన్ అవ్వకుండా ఇక్కడే ఉండటానికి ఎన్నో కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న తమ సంఘానికి తమ హక్కులు ఎలా సాధించుకోవాలో బాగా తెలుసని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో విద్యుత్ ఇంజినీర్లు ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్నారని, అటువంటి వారి ఉద్యోగాలు, ప్రమోషన్లకు ఎటువంటి హాని కలిగినా సహించబోమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈలు సమ్మయ్య, ఆనందం, బిచ్చన్న, పలువురు ఎస్‌ఈలు, అసోసియేషన్ బాధ్యులు చాట్ల శ్రీనివాస్, సమీర్, జాదవ్, నారాయణ పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles