మత్స్య రైతు మురిసె..

Wed,July 10, 2019 01:13 AM

- ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న సర్కార్
- రూ.33 కోట్లతో రాయితీ వాహనాలు, వలలు, తెప్పలు
-మిషన్ కాకతీయతో చేకూరిన ప్రయోజనం
-కేజ్ కల్చర్ సాగుతో నూతన ఒరవడి
-నేడు ప్రపంచ మత్స్య రైతుల దినోత్సవం
ఖమ్మం వ్యవసాయం: తెలంగాణ వచ్చాక మత్స్య కారులకు మంచిరోజులు వచ్చాయి. ఆర్థికంగా బలోపేతం అయ్యారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా 177 సొసైటీలకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ ప్రభుత్వం చేస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 15వేల మంది మత్స్యకార్మికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది. ప్రతి సంవత్సరం దాదాపు 3లక్షలకు పైగా చేపపిల్లలను అందిస్తున్నారు. దీంతో చేపపిల్లల కోసం పెట్టే పెట్టుబడి లేకుండా పోయింది. అదే విధంగా గతంలో ఉన్న రూ 2లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని సైతం రూ.5లక్షలకు పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. అంతే కాకుండా చేపల ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార్మికులకు అవసరమైన పనిముట్లు, రవాణ వాహనాలను కూడా రాయితీపై అందించడం జరిగింది. ఇందు కోసం 2018-19 సంవత్సరానికి గాను సమీకృత మత్స్యాభివృద్ధి పథకానికి రూ 40 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వార వలలు, ద్విచక్ర వాహనాలు, రవాణ వాహనాలు, చేపల అమ్మకం కోసం అవుట్ లేట్లు మంజూరయ్యాయి. గతంలో ఎన్న డూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మత్స్యకార్మికులకు అన్ని రకాల ప్రోత్సాహం అందించడంతో కార్మికులతో పాటు వారి కుటుంబాలకు సైతం జీవనోపాధి కలిగింది.

రూ 33.70 కోట్ల నిధులతో 7,323 యూనిట్లు
సమీకృతమత్య్సాభివృద్ధి పథకం కింద జిల్లాకు 40 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే దాదాపు రూ 33.70 కోట్ల విలువైన ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, వ లలు, తెప్పలు లబ్ధిదారులకు అధికారులు పంపిణీ చేశారు. నెల రోజులుగా సదరు అధికారులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. చేపల ఉత్పత్తి, మార్కెటింగ్, అమ్మకాల కోసం అవసరమైన యంత్రాలు, వలలు, తెప్పలు, లేఅవుట్‌లు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి లబ్ధిదారులు తమ వాటధనం 25శాతం డీడీ రూ పంలో తీసి అధికారులకు అందించారు. ఈ పథకంలో 100మంది సభ్యులు కలిగి ఉన్న మహిళా సంఘాలకు రూ.3లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను అం దించనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 22 సంఘాలను గుర్తించారు. అదే విధంగా ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేసేందుకు గాను 4,894 ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు 82, సంచార మత్స్య వా హనాలు 17, భారీ వాహనాలు 15, ప్లాస్టిక్ ఫిష్ ట్రేస్ యూనిట్లు 41, వలలు, తెప్పలు 2,262 యూనిట్లు, ట్రాన్స్‌పోర్టు వాహనాలు 4, అదే విధంగా పరిశుభ్రమైన చేపల రవాణ కోసం మరో 8 పెద్ద వాహనాలు, నూతన చెరువుల నిర్మాణం కోసం 30 యూనిట్లు, పెద్ద వలలకు సంబంధించి 21 యూనిట్లు చొప్పున మంజూరు చేయడం జరిగింది. నూతన చెరువుల తవ్వకం కో సం 50శాతం రాయితీ ఇస్తుండగా మిగిలిన అన్ని యూనిట్లకు సంబంధించి 75శాతం రాయితీ ఇవ్వ డం జరిగింది. రాష్ట్ర వ్యాప్తం గా అత్యధిక యూనిట్లు మంజూరు అయ్యింది ఖమ్మం జిల్లా కావడం విశేషం. చేపల ఉత్పత్తిలో జిల్లా అగ్రస్థానంలో ఉన్నందున ఎక్కువ మొత్తంలో యూనిట్లకు అవకాశం కలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

13వేల కుటుంబాలకు చేకూరిన ప్రయోజనం
టీ సర్కార్ ప్రవేశ పెట్టిన సమీకృత మత్స్యాభివృద్ధి పథకం ద్వార జిల్లాలో 13,550 కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూ రనుంది. జిల్లా వ్యాప్తంగా 15వేల కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా పరిధిలో మహిళా సంఘాలతో కలిసి 232 మత్స్య పారిశ్రామిక సంఘాలు నిర్వాహణలో ఉన్నాయి. వీటిలో 25 మహిళాసంఘాలు,9 గిరిజన సంఘాలు, 7ఎస్సీ సంఘాలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 1,283 చేపల చెరువులతో పాటు పాలేరు, వైరా, లంకసాగర్ రిజర్వాయర్లులో మత్స్య కార్మికులు చేపలవేట కొనసాగిస్తూ జీవనం వెల్లదీస్తున్నారు. అయితే సమగ్ర మత్య్సభివృద్ధి పథకానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 8,642 మంది కార్మికులు వివిధ యూనిట్ల కోసం 14వేల దరఖాస్తులు చేసు కున్నారు. అధికారులు పూర్తి పరిశీలన చేసిన తరువాత 13,550 ధరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించారు. లబ్ధిదారులను గుర్తించిన అధికారులు ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి డీడీ రూపంలో వాట ధనంను సైతం తీసుకు న్నారు. ఆయా కంపెనీల వాహనాలను సైతం వారి అభీష్టం మేరకు ఎంపిక చేశారు. అనంతరం ఆయా గ్రామాల సొసైటీలకు చెందిన సభ్యులకు వాహనాలను, ఇతర పనిముట్లను అందజే యడం జరిగింది.

మరో రెండు రిజర్వాయర్‌లలో కేజ్ కల్చర్
ఆధునిక పద్ధతిలో చేపల సాగు చేపట్టాలనే ఉద్దేశంతో కేజ్ కల్చర్‌అమలులోకి తీసుకురావడం జరిగింది. స్వరాష్ట్ర సాధన తర్వాత ఈ సాగుపై మత్స్యకారులు మరింత అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యా ప్తంగా ఆయా జిల్లాల మత్స్య కార్మికులను జార్ఖండ్ రాష్ర్టానికి పంపించడం జరిగింది. జిల్లాలోని పాలేరు చెరువు పరిధిలోని మత్స్యపారిశ్రామిక సొసైటీ సభ్యులను సైతం శిక్షణకు పంపిం చారు. అనంతరం పాలేరులో నుంచి కేజ్ కల్చర్ సాగు విజయ వంతంగా కొనసాగించారు. తొలి సారిగా జిల్లాలో పాలేరు రిజర్వాయర్‌లో తొలుత సుమారు రూ. 6 లక్షల వ్యయంతో కేజ్ కల్చర్ పెంపకం ద్వారా చేపల సాగును చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆ శాఖ నుంచి నిధులను వెచ్చించి ఇతర ప్రాంతాల నుంచి సీడ్‌ను తెప్పించి సాగు చేశారు. ఇప్పటికే రెండు సంవత్స రాల నుంచి పంట చేతికి రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో వైరా, లంకసాగర్ రిజర్వాయర్‌లలో సైతం కేజ్ కల్చర్ ఫిష్‌సాగును ప్రవేశప్టెడం జరిగింది. ఇందుకు అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం బరిస్తుండటంతో ఆప్రాంత కార్మికులకు మరింత లబ్ధి చేకూరింది. ఈ విధానంతో నాణ్యమైన చేపల ఉత్పత్తి జరగడంతో పాటు వృత్తిని నమ్ముకొని జీవనాధానం వెల్లదీస్తున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా దొరికింది. గతంలో చేపల ఉత్పత్తి అంటేనే భారంగా భావించిన కార్మికులు నేడు ప్రభుత్వ పోత్సాహం కారణంగా నూతన ఉత్తేజంతో సాగు చేయడమే కాకుండా మార్కెటింగ్ సైతం చేసుకుంటున్నారు.

మత్స్య ఉత్పత్తి ఘణనీయంగా పెరిగింది.. వీ బుజ్జిబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి
ప్రపంచ మత్స్య రైతుల దినోత్సవం పురస్కరించుకొని మత్స్య రైతు కుటుంబాలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మత్స్య కార్మికుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. స్వరాష్ట్ర సాధన తరువాత జిల్లాలో మత్స్య ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. ఒక వైపు కేజ్ కల్చర్ ఫిష్ సాగు అందుబాటులోకి రావ డం, ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం తో మరింత ప్రయోజనం చేకూరింది. ప్రస్తుతం మార్కెటింగ్ చేసుకునేందుకు అవసరమైన వాహనాలను, ఇతర పనిముట్లను సైతం అందించడం జరిగింది.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles