నా చిట్టి చెల్లి.. మా మంచి అక్క..

Wed,July 10, 2019 01:12 AM

- కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమం
- ఇంటి బెంగను పోగొట్టెందుకు శ్రీకారం..
- సత్ఫలితాన్ని ఇస్తున్న ఆలోచన
- జూనియర్లకు బాసటగా నిలుస్తున్న సీనియర్లు
ఖమ్మం ఎడ్యుకేషన్:బడులు తెరిచారు..ప్రభుత్వ బడుల హాస్టల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు ససేమీరా అనేవారు..నేను వెళ్లనమ్మా..! హాస్టల్‌కు అంటూ గగ్గోలు పెట్టేవారు. హాస్టల్ చదువులంటేనే వణికిపోయేవారు. దెబ్బలెన్ని తిన్నా.. వెళ్లనంటే..వెళ్లను..! అంటూ మొరపెట్టుకునే వారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇలాంటివి గ్రామాల్లో కోకొల్లలుగా కనిపించే దృశ్యాలు. అయితే ఇదంతా ఒకప్పుడు. తెలంగాణ సర్కార్‌లో పేద విద్యార్థులు హాస్టల్ చదువులంటేనే ఎగిరి గంతేసేలా చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న కేజీబీవీ, గురుకుల, బీసీ హాస్టల్ చదువులపై అమితమైన ఇష్టాన్ని పెంచింది. ఆయా బడుల్లో చదువులపై విద్యార్థులకు మక్కువ పెరిగేలా చేసింది. ఇంట్లో కుటుంబ సభ్యులను మైమరిచిపోయేలా తోటి విద్యార్థులనే ఆత్మీయులుగా చేసి వారిమధ్య అనుబంధాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. తోటి విద్యార్థులను ఆత్మీయులుగా చేసి కలిసిమెలసి ఆటపాటలతో కూడిన విద్యను నేర్చుకునేందుకు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో నా చిట్టి చెల్లి..మా మంచి అక్క పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు కన్న వారిపై ఉన్న చింతను తొలగిస్తున్నారు.

సొంత అక్కాచెల్లెలు ఉన్న ఓ ఇంటిని గమనిస్తే...! చెల్లి స్కూలుకు వెళ్తుం టే అక్క స్వయంగా జడ వేయడం..పూలు పెట్టడం..అన్నం తినిపించడం.. చదువుకునే సమయంలో చెల్లికి సందేహం వస్తే నివృత్తి చేయడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఆటలాడుకునే సమయంలోనూ అక్కా..చెల్లీ అనుకుంటూ ఒకరినొకరు అప్యాయంగా పిలుచుకుంటూ సరదాగా ఆటలాడుకోవడమూ చూస్తుం టాం. ఇప్పుడు అచ్చం ఇలాంటి సన్నివేశాలే కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థుల మధ్యనా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. చిన్నాపెద్దా..! వయస్సుల్లో తారతమ్య బేధం అనేదే లేకుండా విద్యార్థ్ధులందరు ఒక్కటేననే విషయాన్ని చాటి చెప్తున్నారు. సీనియర్లు..జూనియర్లు అనే తేడా లేకుండా వారి మధ్య అనుబంధాన్ని పెనవేస్తున్నారు. ఇందుకు నా చిట్టి చెల్లి..మా మంచి అక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రస్తుతం కేజీబీవీల్లో సత్ఫలితాన్ని ఇస్తోంది.

ఖమ్మం జిల్లాలో 13కేజీబీవీల్లో 2800మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకవచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్తగా అడ్మిషన్ పొంది పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులపై బెంగపెట్టుకొని ఇంటిబాట పట్టేవారు. దీంతో విద్యా సంవత్సరం మధ్యలో వారి సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుండేది.

నా చిట్టి చెల్లి..మా మంచి అక్కతో సత్ఫలితాలు..
కేజీబీవీల్లో కొత్తగా అమలు చేస్తున్న నా చిట్టి చెల్లి..మా మంచి అక్క కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో నూతనంగా చేరిన ఐదు వందలకు పైగా బాలికలకు ఈ కార్యక్రమం మంచి అవకాశంగా నిలుస్తోంది. వారిని చదువుల్లో రాణించేందుకు ఎంతగానో ఉపకరిస్తోంది. సీనియర్లు తమ పట్ల చూపుతున్న ఆదరణ ఆప్యాయతలకు ఉప్పొంగి కన్నవాళ్లను సైతం మైమరచిపోతున్నారు.

కేజీబీవీల్లో అక్కాచెల్లెళ్ల అనుబంధాలిలా..
కేజీబీవీలో ఆరో తరగతితో ప్రవేశం పొందిన వచ్చిన విద్యార్థినులను బాధ్యత తెలిసిన సీనియర్ విద్యార్థినులకు దత్తతగా ఇస్తున్నారు. వీరు సదురు అమ్మాయిలను అక్కలా ఉంటూ అనుక్షణం బాసటగా నిలుస్తున్నారు.
జూనియర్ బాలికలు ఇంటిపై బెంగ పెట్టుకోకుండా ఆమెతో ప్రే మ, ఆప్యాయతతో మెలుగుతూ ఉండటంతో అందరిలో కలిసిపోతున్నారు.

చదువు నుంచి మొదలు హోంవ ర్కు, కాలకృత్యాలు, నిద్రలేపడం, భో జన నియమాలు, ఆహారం తీసుకునే విధానం, క్రమశిక్షణ, వస్తువులను సర్ధుకునే పద్ధతులు, ఇతరులతో మెదిలే తీరు తెన్నులు తదితర కార్యక్రమాలతో అక్కలు మేమున్నామని చెల్లెళ్లల్లో భరోసా నింపుతున్నారు. సెలవు రోజుల్లో, తీరిక సమయాల్లో ఇంట్లో సొంత అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం ఉట్టిపడేలా కలివిడిగా ఉంటున్నారు. దత్తత తీసుకున్న చెల్లెళ్లకు అక్కలు దగ్గరుండి ఆరోగ్య పరిశుభ్రత గురించి వివరిస్తున్నారు. వారి తలకు నూనె పెట్టి జడవేసి ముస్తాబు చేస్తున్నారు. ఇంటి బెంగతో అన్నం తినని వారికి దత్తత తీసుకున్న అక్కలు ప్రేమతో మాటలు చెప్తూ అప్యాయంగా తినిపిస్తున్నారు.కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చి ఏడుస్తున్నప్పుడల్లా మేమున్నామనే భరోసానిస్తూ ఓదారుస్తున్నారు.

చదువుపై దృష్టి పెంచేందుకే.. ఉదయశ్రీ, జీసీడీవో, ఖమ్మం
కేజీబీవీల్లో ప్రవేశాన్ని తీసుకొని మొద ట ఇష్టంతో వచ్చినప్పటికీ కొద్దిరోజులకు ఇంటి వాళ్లపై బెంగపడి దిగాలుగా ఉం టుంటారు. ఇలాంటి వారికోసం ఇటోళ్లను మైమరిపించే వాతావరణాన్ని కల్పించి వారి దృష్టిని చదువుపై మరల్చేం దుకు నా చిట్టి చెల్లి..నా మంచి అక్క కార్య క్రమాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు జూనియర్లకు బాసటగా నిలస్తూ వారిపై ప్రేమానురాగాలను పంచుతున్నారు. వారికి అన్ని విధా లుగా బాసటగా నిలస్తు న్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిత్యం పాఠశాలల్లో ఏడిచే విద్యార్థుల సంఖ్య తగ్గింది. మంచి వాతావరణంలో అక్కాచెల్లెళ్లు అనే భావంతో సందడిగా ఉం టున్నారు.

ఆత్మీయత బలపడుతోంది.. ఝాన్సీ సౌజన్య, ఎస్‌వో, కారేపల్లి కేజీబీవీ
పాఠశాలల్లో చేపట్టిన మా చిట్టి చెల్లి..మా మంచి అక్క కా ర్యక్రమంతో విద్యార్థిను లలో ఆత్మీ యత బలప డుతోంది. ఒకరినొకరు మేమున్నా మంటూ అక్కున చేర్చు కుంటున్నారు. దీని వల్ల విద్యార్థినుల లో కన్నవారి పట్ల చింత తగ్గి ఆనందంగా ఉంటు న్నారు. ప్రేమలు, ఆప్యాయతలు పెరిగి అక్కాచెల్లెల్లుగా స్నేహపూర్వకంగా ఉంటున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles