ప్రతిపల్లె గులాబీమయం కావాలి..

Wed,July 10, 2019 01:11 AM

- టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ
- జిల్లాను సభ్యత్వ నమోదులోఅగ్రస్థానంలో నిలపాలి : లింగాల
చింతకాని, జూలై 9 : జిల్లాలో పల్లె పల్లె టీఆర్‌ఎస్ సభ్యత్వంతో గులాబీ మయం కావాలని, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమెదులో పల్లె, పట్టణం తేడా లేకుండా విశేష ఆదరణ లభిస్తుందని, పండుగలా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలంలో నాగిలిగొండ, కోమట్లగూడెం తదితర గ్రామాలలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వలన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశానుసారం గ్రామగ్రామాన పార్టీ సభ్యత్వ నమోదు పండుగ వాతావరణంలో నిర్వహించాలని, పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రతికార్యకర్త, నాయకులు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎంతోమంది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపాయని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా నిరుపేద యువతులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్ రూ.1,00,116 అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. దీంతో వాడవాడలా ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారన్నారు. ముఖ్యకార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా సభ్యత్వం పొందేలా కృషి చేయాలని, పార్టీని బలోపేతం చేయడం కోసం మహిళలు, యువకులు, అనుబంధ సంఘాల వారు పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, గడ్డం శ్రీనివాసరావు, కొంగర రామారావు, చాట్ల సురేశ్, చాట్ల భగవాన్, లక్కిరెడ్డి బాబుల్ రెడ్డి, జడ్పీటీసీ పర్సగాని తిరుపతి కిశోర్, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, మండల నాయకులు మంకెన రమేశ్, కిలారు మనోహర్, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, చల్లా అచ్చయ్య, నారపోగు వెంకటేశ్వర్లు, తుడుం రాజేశ్, షేక్ రంజాన్, వేముల నర్సయ్య, రామక్రిష్ణ, పాల్గొన్నారు.

జడ్పీ చైర్మన్‌కు, జడ్పీటీసీకు ఘనసన్మానం..
జిల్లా పరిషత్ చైర్మన్ కమల్‌రాజ్‌కు, చింతకాని జడ్పీటీసీ పర్సగాని తిరుపతి కిశోర్‌కు, నాగిలిగొండ ఎంపీటీసీ చాట్ల భగవాన్‌కు ఆయా గ్రామ శాఖల ఆధ్వర్యంలో శాలువా బోకేలతో ఇక్కడ ఘనసన్మానం చేశారు.

కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీకి శ్రీరామరక్ష..
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలే టీఆర్‌ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని నూతనంగా ఎన్నికైన జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలోని 9, 11 వార్డుల్లో పాదయాత్ర ద్వారా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమన్నారు. మధిర మున్సిపాలిటీలో సమస్యల పరష్కారం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. మధిర మున్సిపాలిటీలో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని, మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మధిర మున్సిపాలిటీపై గులాబిజెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మడుపల్లిలో మూడు వార్డులను అభివృద్ధి చేసే బాధ్యత టీఆర్‌ఎస్ పార్టీ పక్షాన తాను తీసుకుంటానని, మూడు వార్డులను గెలిపించే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలన్నారు. జడ్పీచైర్మన్ అయిన తర్వాత మొదటిసారిగా మడుపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా లింగాల కమలరాజును టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, నాయకులు డాక్టర్ కోట రాంబాబు, పుచ్చకాయల వెంకటనారాయణ, శీలం వీరవెంకటరెడ్డి, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, నాయకులు బిక్కి కృష్ణప్రసాద్, పల్లపోతుల వెంకటేశ్వరరావు, యర్రగుంట రమేష్, బోగ్యం ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles