భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత

Wed,July 10, 2019 01:10 AM

తిరుమలాయపాలెం : అడుగంటిపోతున్న భూగర్భ జలాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలని జడ్పీ సీఈవో ప్రియాంక అన్నారు. మండలంలోని తిప్పారెడ్డిగూడెం, కొక్కెరేణి, రాజారం, తాళ్లచెరువులో ఈజీఎస్ ద్వారా జరిగిన పనులను, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇళ్లలో తవ్విన ఇంకుడు గుంతలను పరిశీలించారు. హరితహారం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకునేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను తవ్వుకోవాలన్నారు. రైతులు తమ పొలాల్లో ఊటచెరువులు, నీటి నిల్వా గుంతలు తవ్వుకోవాలని విజ్ఞప్తిచేశారు. త్వరలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న జలశక్తి పథకాన్ని మండలంలోని అన్ని గ్రామాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ హిందుమతి, ఏపీడీ అశోక్, ఎంపీడీవో జయరాం, మండలస్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles