హరితహారంతోనే భావితరాలకు భవిష్యత్

Wed,July 10, 2019 01:10 AM

-ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి : ఎమ్మెల్యే రాములునాయక్
వైరా, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకంతో బావితరాలకు బంగారు భవిష్యత్ లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరా మండలంలోని గొల్లపూడిలో మంగళవారం ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాములునాయక్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కల పెంపకంతోనే మానవుని మనుగడ ముడిపడివుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని కొనియాడారు. గత 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోట్లాది మొక్కలను నాటారని వివరించారు. ప్రధానంగా ఇళ్లల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, ఖాళీ స్థలాల్లో, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో, పొలం గట్లపై విరివిగా మొక్కలు నాటాలన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మొక్కలు నాటి జిల్లాలో వైరాను ప్రథమ స్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, నూతన జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా ఎంపీపీ వేల్పుల పావని, సర్పంచ్ పసుపులేటి వినోద, ఎంపీటీసీ బంకా లేయమ్మ, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్‌రావు, నాయకులు ముళ్లపాటి సీతారాములు, సాదం రామరావు, ఇటుకుల మురళి, బాణాల వెంకటేశ్వరరావు, మడుపల్లి సైదా, గంజినబోయిన అక్కమ్మ, లక్ష్మీనారాయణ, తిరుమలదాసు నాగేశ్వరరావు, వేసం శివయ్య, పసుపులేటి ప్రదీప్, రాజేష్ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles