ప్రశాంతంగా ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష

Mon,July 8, 2019 03:19 AM

మామిళ్లగూడెం, జూలై 7: ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించిన తెలంగాణ ఎస్సీ స్టడీసర్కిల్ ఐదున్నర నెలల ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఇతర వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కోర్సు ప్రవేశ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడిసర్కిల్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంటల వరకు ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి 332 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 230 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరో 102 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి, ప్రవేశ పరీక్ష ముఖ్య పరిశీలకులు కే సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 100 మంది అభ్యర్థులను ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేసి ఉచితంగా ఐదున్నర నెలల పాటు రెసిడెన్షీయల్ పద్దతిలో జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఉంటుందని వివరించారు. ఫలితాలను త్వరలోనే స్టడీ సర్కిల్ వెబ్‌సైట్ ద్వారా తెలుపుతామని అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టడీసర్కిల్ గౌరవ సలహాదారు సీహెచ్ వీరభద్రం, ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరెడ్డి, పరీక్ష కో ఆర్డినేటర్ బీ శ్రీనివాస్, లైజనింగ్ ఆఫీసర్ జయరాజు, సిబ్బంది డీవీఎల్‌ఎన్ జయశ్రీ, ఏ లిఖిత, జానీమియా, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles