డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం

Mon,July 8, 2019 03:18 AM

-356 మంది కార్మికులకు లబ్ధి
రామవరం, జులై 7 : సింగరేణి డిస్మిస్ కార్మికులపై సంస్థ సీఅండ్ ఎండీ నడిమెట్ల శ్రీధర్ వరాల జల్లు కురిపించారు. 2000 నుంచి 2018 వరకు డిస్మిస్ అయిన కార్మికులను రెండు షరతులతో తిరిగి ఉద్యోగాలలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 1-1-2000 సంవత్సరం నుంచి 31-12-2018 వరకు సింగరేణిలో పనిచేసి డిస్మిస్ అయినవారు తమ ఐదేళ్ల సర్వీసులో ఏదైనా రెండేళ్లులో 100 మస్టర్లను కలిగి ఉండాలని 1-7-2018 నాటికి వారి వయస్సు 46 ఏళ్లకు మించకుండా ఉండాలనే నిబంధనలతో ఉద్యోగాలను ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా 356 మందికి తిరిగి ఉద్యోగాలు లభిస్తుండగా ఆయా కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ సీఅండ్‌ఎండీ నడిమెట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ నెల 2,3 తేదీలలో 37వ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో టీఆర్‌ఎస్‌పార్టీ అనుబంద గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తో కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైద్రాబాద్‌లో సింగరేణి భవన్‌లో బధవారం జరిగిన సమావేశంలో డిస్మిస్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామనడంతో సింగరేణి వ్యాప్తంగా డిస్మిస్‌అయిన కార్మికుల కుటుంబసబ్యులు కార్మికులు టీఆర్‌ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు, సీఅండ్‌ఎండీకి ఎప్పటికీ రుణపడి ఉంటామని అంటున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles