సాంకేతికతతోనే మరింత అభివృద్ధి

Sun,July 7, 2019 12:52 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాష్ర్టాభివృద్ధికి సాంకేతికను జోడిస్తే ఫలితాలు సాధారణ కంటే ఎంతో మెరుగుగా ఉంటాయని, అందుకు ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం నిరూపించిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. అమెరికాలోని వాషింగ్‌టన్‌లో జరిగిన తానా బిజినెస్ ఫోరం -2019 వివిధ వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ఓరవడిని తీసుకోచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న వివిధ రంగాలకు సాంకేతికను జోడిస్తే అద్భుత ఫలితాలు సాకారం అవుతాయని వివరించారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ హబ్‌ల ద్వారా మల్టీనేషనల్ కంపెనీలకు స్థానం కల్పించడం ద్వారా అయా సంస్థల్లో యువతకు ఉద్యోగాలు, వివిధ రకాల నైపుణ్యాల శిక్షణలతో అనేక కొత్త ఆవిష్కరణలు చేయాల్సి ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో 25 కోట్లతో ఐటీ హబ్‌ల ఏర్పాటుతో సాంకేతికతను విస్తరించి వేల మందికి ఉపాధిని కల్పించనున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఐటీ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కంపెనీలు ఇప్పటికే ఖమ్మంలో తమ సంస్థ కార్యకలాపాలు ఏర్పాటుకు అంగికరించారని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్‌లైన్ వ్యవస్థ తీసుకొచ్చి ఇటు వ్యాపారులకు, ప్రజలకు తెలికపాటి పనులు, వ్యాపారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా సులభతరంగా స్మాల్ అండ్ అశించిన ఫలితాలు ఉంటాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వ్యాపారులు సులువుగా వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మరికొన్ని వాటికి సబ్సిడితో యువతను ప్రోత్సహిస్తు వ్యాపార రంగాన్ని విస్తరిస్తుందన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles