టీఆర్‌ఎస్ పార్టీకి నీరాజనాలు..

Sun,July 7, 2019 12:51 AM

-వాడవాడలా సభ్యత్వ నమోదుకు విశేష స్పందన..
మధిర, నమస్తేతెలంగాణ : నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలో పలువురికి ఆయన సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాడవాడలా ప్రజలు టీఆర్‌ఎస్‌కు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని ప్రతిఒక్కరికీ అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మధిర పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు పల్లబోతు వెంకటేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, బిక్కి ప్రసాద్, గుగులోతు కృష్ణానాయక్, తేళ్ల వాసుదేవరావు, యర్రగుంట రమేష్, రావూరి శ్రీనివాసరావు, పర్సా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles