సేవా సంస్థల తోడ్పాటు అభినందనీయం

Sun,July 7, 2019 12:51 AM

వేంసూరు : గ్రామాభివృద్ధికి, పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సేవాసంస్థల తోడ్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం వేంసూరులోని సొసైటీ మాజీ చైర్మన్ మోరంపూడి కృష్ణారావును, లచ్చన్నగూడెం సర్పంచ్ సుహాసిని భర్త ప్రసాద్ ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం భరిణెపాడు ప్రాథమిక పాఠశాలలో నిస్వార్ధ ఇండియా ఫౌండేషన్, భరిణెపాడు సేవాసమితి, ఎన్టీఆర్ సేవాసమితిల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సండ్ర మాట్లాడుతూ నిస్వార్ధ ఇండియా ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు ఫ్యాన్లతో పాటు కుళాయిలు ఏర్పాటు, ఇంకుడు గుంట నిర్మాణం కోసం రూ.40వేల వితరణగా అందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ సేవాసమితి ద్వారా ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు. అదే విధంగా గ్రామానికి చెందిన మందపాటి కృష్ణారెడ్డి వారి తల్లిదండ్రులైన గంగిరెడ్డి, నాగమ్మల జ్ఞాపకార్థం విద్యార్థులకు వాటర్ ఫ్యూరిఫైడ్ ప్లాంట్, దీనితో పాటు మందపాటి నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు అవసరమైన ఎల్‌ఈడీ టీవీని వితరణగా అందించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులను, మండల అధికారి చలంచర్ల వెంకటేశ్వరరావును అభినందించారు. నియోజకవర్గంలో బాసర ట్రిపుల్ ఐటీకి 8 మంది విద్యార్థులు ఎంపిక కాగా వేంసూరు మండలం నుంచే ఏడుగురు ఎంపిక కావడం ఉపాధ్యాయుల కృషి ఎంతో అర్ధమౌతుందన్నారు. భరిణెపాడు గ్రామానికి చెందిన చింతకాయల మనీషా పదిలో 9.5 పాయింట్లు సాధించి గుర్తింపును తీసుకరావడంతో ఆ విద్యార్థిని ఎమ్మెల్యే సండ్ర మెమెంటో, శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందించారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అనారోగ్యం బారిన పడిన వారిని ఆదుకునేందుకు సీఎం సహాయనిధి వారికి ఆసరాగా నిలుస్తుందన్నారు.

బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని వినతి..
తమ గ్రామంలో బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సర్పంచ్ మందపాటి సునీతారెడ్డి, మాజీ సర్పంచ్ మందపాటి విజయలక్ష్మిలు వినతిపత్రాన్ని అందజేశారు. మద్యం రహిత గ్రామంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకునేందుకు మీ సహకారం అవసరమని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఎక్సైజ్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్‌రావు, ఉపసర్పంచ్ మేడా వెంకటరామారావు, కేజీ మల్లేల సొసైటీ చైర్మన్ గడిపర్తి రాంబాబు, కేజీ మల్లేల, రామన్నపాలెం, మర్లపాడు సర్పంచ్‌లు పోట్రు అనంతరామయ్య, షేక్ నాగుల్‌మీరా, మందపాటి వేణుగోపాల్ రెడ్డి, నాయకులు మందపాటి మహేశ్వర రెడ్డి, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, బండి వెంకటకృష్ణారెడ్డి, అట్లూరి సత్యనారాయణ రెడ్డి, సీతారామిరెడ్డి, బండి చిన్నపుల్లారెడ్డి, యర్రా రమేష్, గొర్ల రామ్మోహన్ రెడ్డి, ఎండీ.ఫైజుద్దీన్, కోటేశ్వరరావు, తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, వసంతరావు, పాఠశాల హెచ్‌ఎం రత్నరాజు, ఉపాధ్యాయులు సృజనరావు, దుర్గారావు, వెంకటరెడ్డి, దుబా శ్రీనివాసరెడ్డి, నూతన ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles