భూసార పరీక్షలు చేయించుకోవాలి

Sun,July 7, 2019 12:50 AM

చింతకాని, జూలై 6 : మండలంలో ఆయా గ్రామాల రైతులందరూ తమ భూముల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు కే వెంకటేశ్వర్లు శనివారం అన్నారు. మండలంలో రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూసార పరీక్షల ధృవపత్రాలను గ్రామంలో రైతులకు అందచేశారు. రైతులందరూ క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయించడం వల్ల తమ భూముల్లో ఎరువుల వినియోగం, భూసారం తదితర అంశాలు రైతులకు తెలుస్తాయని, భూసార పరీక్షలు చేయించుకోదలచిన వారు సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగిడి ఝాన్సీ, రైతు సమన్వయ సమితి కన్వీనర్ బంధం క్రిష్ణ, ఏవో నాగయ్య, ఏఈవో రాము, అంగిడి సుధాకర్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles