ఆదర్శ పార్క్‌ను పరిశీలించిన డీఎఫ్‌ఓ

Sun,July 7, 2019 12:50 AM

సత్తుపల్లి టౌన్, జులై 6 : సత్తుపల్లి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరం కల్పించే విధంగా ఆదర్శ పార్క్‌ను తీర్చిదిద్దుతామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డి. ప్రవీణ అన్నారు. శనివారం సత్తుపల్లిలో ఆమె పర్యటించి నర్సరీలను తనిఖీ చేసి అనంతరం సుమారు 150 హెక్టార్‌లలో ఏర్పాటు చేసే పార్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100 హెక్టార్‌లను న్యాచురల్‌గా ఉంచుతూ 50 హెక్టార్‌లలో పట్టణ ప్రజలకు అనేక సౌకర్యాలతోటి ఓపెన్ జిమ్, కూర్చోవటానికి బెంచీలు, వాకింగ్ ట్రాక్, చుట్టు చైన్‌లింక్‌ను ఏర్పాటు చేయటానికి టెండర్లను కూడా పిలిచామన్నారు. ఈ ప్రదేశంలో సుమారు 80 జింకలు ఉన్నాయని వాటి కోసం ఏడు చెరువులను ఏర్పాటు చేశామని, వాటిని మరింత విశాలంగా ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు చేస్తున్నామని, వాటి ఆహారం కోసం ప్రత్యేకంగా గడ్డిని కూడా పెంచుతున్నామన్నారు. హరితహారంలో బాగంగా 6 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని వర్షాభావ పరిస్థితి అందుబాటులో లేనందున్న హరితహారం ప్రారంభించలేదన్నారు. ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు , సెక్షన్ ఆఫీసర్ నర్సింహరావు, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles