అందరూ ఆరోగ్యంగా ఉండటమే.. సీఎం కేసీఆర్ లక్ష్యం

Sat,July 6, 2019 01:35 AM

ఖమ్మం, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన 27 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన సుమారు రూ.8 లక్షల విలువైన చెక్కులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సహాయ నిధితోపాటు అనేక పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలపాలిట పెన్నిధిగా మారారని కొనియాడారు. దమ్మపేట మండలానికి చెందిన ఒకరికి రూ.20 వేలు, ఏన్కూరు మండలానికి చెందిన ఒకరికి రూ.60 వేలు, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన ముగ్గురికి రూ.83 వేలు, కొత్తగూడేనికి చెందిన ఇరువురికి రూ.57 వేలు, చింతకాని మండలానికి చెందిన ఇద్దరికి రూ.69 వేలు, మధిర మండలానికి చెందిన ముగ్గురికి రూ.47 వేలు, ఎర్రుపాలెం మండలానికి చెందిన ఇద్దరికి రూ.54,500, కూసుమంచి మండలానికి చెందిన ఒక్కరికి రూ.52 వేలు, నేలకొండపల్లి మండలానికి చెందిన ఒక్కరికి రూ.33 వేలు, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఇద్దరికి రూ.47,500, కల్లూరు మండలానికి చెందిన ఇద్దరికి రూ.75 వేలు, పెనుబల్లి, జూలూరుపాడు సింగరేణి, కామేపల్లి మండలాలకు చెందిన నలుగురికి రూ.1.48 లక్షలు, కొణిజర్ల మండలానికి చెందిన ముగ్గురికి రూ.57,500 మంజూరు కాగా ఆయా చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ అందజేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బజ్జూరి వెంకటరెడ్డి, కేవీ చారీ, వడ్డెబోయిన శ్రీనివాసరావు, కొప్పెర ఉపేందర్, తాళ్లూరి రాము, పాల నాగేశ్వరరావు, బానాల లక్ష్మణ్, కన్నెబోయిన సీతారామయ్య, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles