స్వచ్ఛందంగా సభ్యత్వం..

Sat,July 6, 2019 01:35 AM

(ఖమ్మం, నమస్తే తెలంగాణ) :టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా శరవేగంగా సాగుతోంది. తెలంగాణలోనే సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లా అగ్రభాగాన నిలిచేలా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుండగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలను తీసుకుంటున్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోంది. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా కీలక నాయకులు పాల్గొంటున్నారు. వైరా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో, గ్రామాలలో స్థానిక నాయకులు సభ్యత్వాలను చేర్పిస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, బోనకల్‌లో జిల్లా పరిషత్ నూతన చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం ముందు ఏ పార్టీ మిగలదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. వచ్చే ఇరవై ఏండ్ల వరకు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని కమల్‌రాజ్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

సత్తుపల్లిలో పాల్గొన్న పొంగులేటి, సండ్ర
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రజలు ఉవ్వెత్తున పార్టీలో చేరి తాము కూడా టీఆర్‌ఎస్ సైనికులమంటూ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి పేర్కొన్నారు. సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉండాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి సభ్యత్వ నమోదు ఉండాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాలనూ కైవసం చేసుకుని టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దిశా కమిటీ సభ్యుడు డాక్టర్ మట్టా దయానంద్, మాజీ ఎంపీపీ జేష్ఠ అప్పారావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, గాదె సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు చెందిన అంశాలను పొందుపరచడంలో భాగంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ సెంటర్ ప్రారంభమైంది. శుక్రవారం ఈ సెంటర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం ఈ సెంటర్ ఎంతగానో దోహదపడనుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణభవన్‌లోలో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేసి 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. నిత్యం డేటా మొత్తాన్ని కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles