సభ్యత్వ డిజిటలైజేషన్ సెంటర్ ప్రారంభం

Sat,July 6, 2019 01:34 AM

ఖమ్మం, జూలై 5 (నమస్తే తెలంగాణ): టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదుకు చెందిన అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడంలో భాగంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ సెంటర్ ప్రారంభమైంది. శుక్రవారం ఈ సెంటర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు లెక్క పక్కాగా నమోదు ప్రక్రియ కోసం ఈ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పండుగలా జరుగుతోందన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 20 మంది కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా డేటా మొత్తాన్ని నిత్యం కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. ఈ మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించేందుకు దినేష్‌చౌదరిని రాష్ట్ర పార్టీ ప్రత్యేకంగా నియమించిందని అన్నారు. సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలిచేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జులు పూర్తి చేసిన సభ్యత్వాలు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించినట్లయితే ఎప్పటికప్పుడు ఆ సభ్యత్వాలను ఆన్‌లైన్ చేస్తామని చెప్పారు. దినేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేష్, టీఆర్‌ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తూముల అభిలాష్, హనుమంతరెడ్డి, గుత్తా రవి,కోటి, జలగం, రామకృష్ణ, గుర్రం జగన్, గుండ్ర రాము తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles