అటవీ భూములను పరిరక్షించండి

Sat,July 6, 2019 01:34 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : అటవీ భూములు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించి వాటి రక్షణకు అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అటవి సంరక్షణలో ఎదువుతున్న సమస్యలపై అటవి శాఖ అధికారును అడిగి తెలుసుకున్నారు. పోడుభూముల సమస్య, ఆర్‌ఓ ఎఫ్‌ఆర్ పట్టాలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం ద్వారా రెవెన్యూ, అటవి శాఖల మధ్య భూవివాధాలు తలెత్తడం వంటి అంశాలపై పరిష్కార స్వభావం సూచించారు. అటవి భూములనుఅక్రమంగా కొనుగోలు చేయడం, అమ్మడం కేసులకు సంబంధించిన వివరాలను అటవిశాఖ అధికారులు సంబంధిత మండల తహశీల్దార్లకు అదేవిధంగా పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు లిఖిత పూర్వకంగా అందించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

దీనితో పాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు సంబంధించిన భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి వారిపై చట్టరీత్యా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అటవి సంపదను వన్యప్రాణి సంరక్షణకు అటవిశాఖ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని అటవి శాఖ అధికారులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారని వారి వ్యక్తిగత భద్రతకు పోలీసు సహాయ సహాకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, పోలీసు, అటవీ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలోని అటవీ సంపదను, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య గల భూ వివాదాలను సత్వరమే పరిష్కరించే విధఃగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హరితహారం సందర్భంగా జిల్లాలోని అటవి భూములలో మొక్కలు నాటేందుకు ఇప్పటికే గుర్తించిన ప్రాంతాలలో ఎక్కడైనా ప్రజల నుంచి వ్యతిరేకత గాని ఎటువంటి సమస్యలు గాని ఉత్పన్నమైతే వెంటనే పోలీసు సహాకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రధానంగా రిజర్వ్ ఫారెస్టు సరిహద్దు వివాదాలను, భూ వివాధాల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో అటవీ, రెవెన్యూ అధికారులతో పాటు సర్వే బృందాలు సర్వే చేసి వివాదాల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ జిల్లాలో అటవీ సంరక్షణలో సమస్యాత్మక గ్రామాల వివరాలను అందజేయాలని గ్రామాలలో గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా అటవీ శాఖ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

వన్యప్రాణుల వేటను నిరోధించి వన్యప్రాణులను సంరక్షించడానికి గతంలో వన్యప్రాణుల వేటకు పాల్పడిన పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను కమిషనర్ ఆదేశించారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటవిశాఖ సిబ్బందికి తగిన రక్షణ కల్పించేందుకు తమకు ముందస్తుగానే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులను ఆయన కోరారు. ముఖ్య అటవీ సంరక్షణ అధికారి పివీ రాజారావు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు రిజర్వ్ ఫారెస్ట్, నాన్ రిజర్వ్ ఫారెస్ట్ అదే విధంగా ప్రభుత్వ భూముల గురించి అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు తెలియజేయాలని కొన్ని ప్రాంతాల్లో అసైన్‌మెంట్ పట్టాలు ఇచ్చి లొకేషన్ చూపించని కారణంగా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ఆధునీకరణ ద్వారా చాలా వరకు భూ వివాదాల సమస్యలు పరిష్కరించబడ్డాయని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, సహాయ కలెక్టర్ హన్మంతు కొడింబా, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, అడిషనల్ డీసీపీ మురళీధర్‌రావు, ఖమ్మం, సత్తుపల్లి ఎఫ్‌డీవోలు ప్రకాశ్‌రావు, సతీశ్‌కుమార్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శివాజీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ దశరథ్, సర్వేల్యాండ్ ఏడీ రాము, ఏసీపీలు, స్టేషన్ హౌస్ అధికారులు, తహసీల్దార్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, విద్యుత్, వ్యవసాయ, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles