ప్రతీ ఇంటికి సభ్యత్వం ఇవ్వాలి

Thu,July 4, 2019 04:04 AM

- టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: ప్రతీ ఇంటికి టీఆర్‌ఎస్ సభ్యత్వం అందేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు అన్నారు. బుధవారం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ పుస్తకాలను అందజేసిన ఆయన 33 వార్డుల ఇన్‌చార్జులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ సభ్యత్వాన్ని అందజేయాలని, సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ను పార్టీ ఇవ్వనుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, సీఎం కేసీఆర్ మాట ప్రకారం ప్రతీ నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు నమోదు చేయడమే ధ్యేయంగా పనిచేయాలని, ఇందుకు ప్రతీ కార్యకర్త తోడ్పాటును అందించాలన్నారు. సభ్యత్వ పుస్తకాల పంపిణీలో టీఆర్‌ఎస్ నాయకులు ఎంఏ రజాక్, కాసుల వెంకట్, పాండురంగాచార్యులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మరాజు, శ్రీను, గోబ్రియా నాయక్, ఏ.శ్రీను, కనుకుంట్ల పార్వతి, బండారి రుక్మాంగధర్, గాయత్రి, ఆకుల సుధాకర్, కోటేశ్వరరావు, రెహమాన్,కరాటే శ్రీను, మసూద్, దూడల బుచ్చయ్య, మాదా శ్రీరాములు, కొదురుపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఒకటో వార్డు నుంచి సభ్యత్వ కార్యక్రమాలు ప్రారంభించాలని కొదురుపాక రాజేంద్రప్రసాద్‌కు ఆయన సభ్యత్వ పుస్తకాన్ని అందజేశారు. దుంపల రాజేష్, బాలాజీ నాయక్, శ్రీధర్, రమాకాంత్, మహేష్, బాలప్రసాద్, దామోదర్, భారతి, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles