పల్లెల సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యం

Thu,July 4, 2019 04:04 AM

ఇల్లెందు రూరల్, జూలై 3 : పల్లెల సమగ్రాభివృద్ధే టీఆర్‌ఎస్ లక్ష్యమని, దీనికోసం సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మండలంలోని రొంపేడు ఎంపీటీసీ దనసరి శాంత, వార్డు సభ్యులు బిక్షపతి, రామారావు, 32 కుటుంబాలు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారికి ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒడ్డుగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో వారు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించారని పేర్కొన్నారు. ప్రతీ పల్లెలోనూ తాగునీటి పథకాలు, సీసీ రహదారులు, బీటీ రహదారులు, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ వంటి అనేక పనులు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయంను లాభసాటిగా తీర్చిదిద్దేందుకు రైతులకు అవసరమైన సౌకర్యాలన్నింటిని సమకూర్చారని తెలిపారు. ప్రధానంగా సాగునీరు, నిరంతర విద్యుత్తు, గిడ్డంగుల నిర్మాణంతోపాటు రైతు బంధు, రైతు బీమ పథకాలు అన్నదాతలకు వరంలా మారాయని గుర్తుచేశారు.

అంతకు ముందు ఒడ్డుగూడెం గ్రామస్తులు ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలకు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవతలకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితోపాటు జడ్పీటీసీ ఉమాదేవి, ఎంపీపీ చీమల నాగరత్నమ్మలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్‌ఎంపీపీ దాస్యం ప్రమోద్, మండల పరిషత్తు కో-ఆప్షన్ సభ్యుడు జానీబాబా, సర్పంచ్ అంబాలి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ పులిగళ్ళ మాధవరావు, టీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు సిలివేరు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు భావ్‌సింగ్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు అక్కిరాజు గణేష్, బోళ్ళ సూర్యం, తాండ్ర నాగరాజు, మడుగు సాంబమూర్తి, ఎల్లయ్య, గుగులోత్ నాగార్జున, ఇందిరాల మురళి, హనుమ, ధనసరి ఎర్రయ్య, మోకాళ్ళ వెంకటేశ్వర్లు, రవీందర్, పూనెం రాజేశ్వరరావు, వెంకన్న, రాంబాబు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles