ఏడీ పల్లవి ఇక లేరు..

Thu,July 4, 2019 04:04 AM

మయూరి సెంటర్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఖమ్మం జిల్లాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రేమతో పలకరించే అధికారి పల్లవి ఇకలేరు. ఎప్పుడు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు ప్రభుత్వం నిర్థేశించిన ఆదేశాలను జారీ చేస్తూ ఔషద నియంత్రణ విభాగ పాలనలో ఆమెకు ప్రశంసలే కాని రిమార్కులు లేవు. విధులు ముగించుకుని స్వస్థలమైన వరంగల్ హన్మకొండకు వెళ్తున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించింది. ఖమ్మం జిల్లా ఔషధ నియంత్ర పరిపాలన అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్‌గా బానోత్ పల్లవి (46) ఖమ్మం జిల్లా హెడ్‌క్వార్టర్‌లో విధులు నిర్వర్తించి తమ నివాసమైన వరంగల్ జిల్లాకు తిరుగు ప్రయాణం కాగా బుధవారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వాగ్ధేవి కళశాలలో బీ పార్మసీ పూర్తి చేసి 2007లో ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. వరంగల్ రీజియన్ పరిధిలో డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది, 2015లో ఖమ్మం జిల్లాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పల్లవికి పాప, బాబు ఉండగా ఇద్దరు సోదరులు విదేశాలలో ఉన్నారు.

మార్చురీ వద్ద అధికారుల నివాళి..
రోడ్డు ప్రమాదంలో డ్రగ్ కంట్రోల్ ఏడీ పల్లవి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు జిల్లా వైద్యవిధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మార్చురీ వద్దకు చేరుకుని ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లా ఔషధనియంత్రణ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, యూనియన్ నాయకులు సంతాపం ప్రకటించారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles