పోడు.. పోరు..

Wed,July 3, 2019 04:15 AM

ములకలపల్లి: అటవీ భూములను రక్షించేందుకు అటవీ అధికారులు, పోడు భూములను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇది, పోరుగా మారుతోంది. అటవీ అధికారులపై, సిబ్బందిపై దాడులు సాగుతున్నాయి. పో డు సాగుదారుల దాడిలో ఆరుగురు అటవీ అధికారులు గాయపడ్డారు. మండలంలోని తిమ్మంపేట శివారు గుండాలపాడు పంచాయతీ లో సోమవారం తెల్లవారుజామున ఇది జరిగిం ది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు...

గుండాలపాడు పంచాయతీలోని చింతపాడు, గుండాలపాడు, చలమన్ననగర్ గ్రామాలకు చెందిన కొంతమంది గిరిజనులు, కొన్నాళ్ల నుంచి కంపార్ట్‌మెంట్ నెంబర్ 344లోని సుమారు వెయ్యి ఎకరాలలో పోడు సాగు చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి కొంతమంది రైతులు ఆ భూమిని ట్రాక్టర్లతో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమాచారంతో, స్థానిక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈసం నీలమయ్య, సిబ్బంది కలిసి అక్కడకు వెళ్లారు. దుక్కులు దున్నుతున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. వాటిని ఫారెస్ట్ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తాము 2005కు ముందు నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నామని పోడు సాగుదారులు చెప్పారు. ట్రాక్టర్లను తీసుకెళితే ఊరుకోబోమని అడ్డం తిరిగారు. అటవీ అధికారి.. సిబ్బందితో పోడు సాగుదారులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఇంతలో నే మరికొందరు గిరిజనులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ట్రాక్టర్లను ఫారెస్ట్ ఆఫీసుకు తరలించాల్సిందేనని అధికారులు పట్టుబట్టారు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోడుసాగుదారులు రెచ్చిపోయారు. అటవీ అధికారులపై కర్రలతో దాడికి దిగారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈసం నీలమయ్య, బీట్ ఆఫీసర్లు గుగోలోత్ భాస్కర్, భుక్యా పద్మ, వాచర్లు భుక్యా రమేష్, కోండ్రు సందీప్, కారం నాగరాజు గాయపడ్డారు. వారు అక్కడి నుంచి ములకలపల్లి చేరుకున్నారు. న్యూడెమోక్రసీ నాయకుడు నూపా భాస్కర్ రెచ్చగొట్టినందునే తమపై కొందరు పోడు సాగుదారులు దాడి చేశారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును ఇన్‌చార్జ్ హౌజ్ ఆఫీసర్ ప్రసాద్ నమోదు చేశారు. క్షతగాత్రులను మంగపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.

12మంది అరెస్ట్, మూడు ట్రాక్టర్లు సీజ్
గుండాలపాడులో అటవీశాఖ అధికారుల విధులను ఆటంకపరిచి, దాడికి దిగిన 12మందిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేశారు. మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో న్యూడెమాక్రసీ జిల్లా నాయకుడు నూపా భాస్కర్, పోడు సాగుదారులు కారం ఎర్రయ్య, కారం వెంకటేశ్వర్లు, కుర్సం పంతులు, కట్టం కోసయ్య, మడివి సు నిల్, కుర్సం ముకేష్, చుక్కా శ్రీను, కణితి రా జు, కణితి భద్రమ్మ, కారం దూలయ్య, పోతుగంటి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

మూకుమ్మడిగా దాడి చేశారు
మా సెక్షన్ ఆఫీసర్ ఈసం నీలమయ్య ఆధ్వర్యంలో మేము, ైస్ట్రెకింగ్ ఫోర్స్ సిబ్బంది కలిసి సోమవారం రాత్రి ములకలపల్లి రేంజ్‌లోని గుండాలపాడు పంచాయతీలో పెట్రోలింగ్‌కు వెళ్లాం. తిమ్మంపేట అటవీ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నెంబర్ 344లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నటాన్ని గమనించి అక్కడకు వెళ్లాం. ట్రాక్టర్లను అడ్డుకుని, బేస్ క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నిం చాం. ట్రాక్టర్ డైవర్లు ఇచ్చిన సమాచారంతో కొందరు పోడు సాగుదారులు వచ్చారు. కర్రలతో మాపై దాడులకు దిగారు. నాతోపాటు తిమ్మంపేట బీట్ ఆఫీసర్ భుక్యా పద్మ, ైస్ట్రెకింగ్ ఫోర్స్ అధికారి భూక్యా రమేష్, బేస్ క్యాంప్ వాచరు ్లకోండ్రు సందీప్, కారం నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అడవుల అభివృద్ధికి, రక్షణకు రేయనక పగలనక శ్రమిస్తున్న కష్టపడుతున్న మాపై సాగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. రక్షణ కల్పించాలి.
- గుగులోత్ భాస్కర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, చలమన్ననగర్

దాడులకు దిగితే సహించం
అటవీ అధికారులపై దాడులకు దిగితే సహించేది లేదు. వలస గొత్తికోయలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుమారు పదివేల హెక్టార్ల అటవీ భూమి ఇప్పటికే నాశనమైంది. ఏటేటా కొత్తగా వెయ్యి హెక్టార్ల చొప్పున అడవిని నరుకుతున్నారు. చలమన్ననగర్ అటవీప్రాంతంలో కొందరు గొత్తికోయలు సోమవారం రాత్రి ట్రాక్టర్లతో అటవీభూమిని చదును చేస్తుండగా, మా శాఖ అధికారులు అడ్డుకున్నారు. వారిపై సాగుదారులు కర్రలతో దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు. స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతుతో వలస గొత్తికోయలు రెచ్చిపోతున్నారు. అటవీ అధికారులపై దాడులను అడ్డుకోకపోతే... వారి మనోస్థర్యం దెబ్బతినే ప్రమాదముంది. ఇకపై అటవీ అధికారులపై దాడులు చేస్తే, సహించేది లేదు.

- శివాల రాంబాబు, డీఎఫ్‌వో, కొత్తగూడెం

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles