బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి..

Wed,July 3, 2019 01:19 AM

-తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి
-ఎమ్మెల్సీ, మండలి విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసిన బిల్డర్లు
ఖమ్మం నమస్తేతెలంగాణ: ఖమ్మం జిల్లాలోని ఏ బిల్డర్‌కు సమస్యలున్నా తమ దృష్టికి వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సామినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా జనరల్‌బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకవెల్లనున్నామని, ఆయన సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సెక్రటరీ బీ భాస్కర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, కోశాధికారి నర్సింహారావు, వైస్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, గ్రేటర్ హైద్రాబాద్ సెంటర్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నల్గొండ సెంటర్ అధ్యక్షుడు సత్యనారాయణలు మాట్లాడిన వారిలో ఉన్నారు. ఈ సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా సెంటర్ సెక్రటరీ వెజెళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

శాసనమండలి విప్ పల్లాను కలిసిన బిల్డర్స్
అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకులు...
ఖమ్మంలోని ఓ హోటల్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ నాయకులు, శాసనమండలి విఫ్, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాని కోరారు. బిల్డర్లు కోరిన విధంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసువెలతానని పల్లా హామీ ఇచ్చారు. పల్లాను కలిసిన వారిలో బిల్డర్ల అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles