బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి..

Wed,July 3, 2019 01:18 AM

ఖమ్మం క్రైం, జూలై 2: పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ కోనియాడారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు ఏఆర్‌ఏఎస్‌ఐ, యూనిట్ డాక్టర్‌లను పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ తఫ్సీర్ మాట్లాడారు. పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన వీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక పండగల సమయంలో భార్యాపిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేశారని, పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా గడపాలని మీ జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

పదవీ విరమణ పొందిన వారిలో..
బీ ఇజ్రాయిల్ (సీసీఆర్‌బీ ఎస్‌ఐ), బీ రాజారావు (ఎస్‌ఐ, ఆర్బన్), జీ శంకర్‌ప్రసాద్ (ఏఆర్‌ఎస్‌ఐ), కే సత్యనారాయణ (ఏఆర్‌ఎస్‌ఐ), యూనిట్ డాక్టర్, జానీ లున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఆడ్మిన్) ఇంజరాపు పూజ, ఏసీపీ రామనుజం, ఏఆర్ ఏసీపీలు విజయబాబు, రియాజ్, పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జ్యోతి, జానీమియా, మోహన్‌రావు, సౌకత్ అలీ, డాక్టర్ రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles