టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి.. సంక్షేమం

Tue,July 2, 2019 03:14 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో ప్రజా సమస్యలతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాలల్లో ముందుండి పోరాడి గెలిచింది తెరాస పార్టీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విప్ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం వీడీవోస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వాల నమోదు సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పేదోడి కష్టాలను స్వయంగా ఎరిగి స్వయంగా వారితో మమేకమై వారి పక్షానే పోరాటాలు చేసిన పార్టీ నేడు అధికారంలో ఉండటం వల్లే ప్రతి పేద వాడికి న్యాయం జరుగుతుందన్నారు. నేడు అధికారంలో ఉన్న తెలంగాణరాష్ట్రంలో పేదలసంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపి అనేక సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి అందిస్తున్నారని వివరించారు.

ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పోయారు. ఉద్యమంతో ప్రారంభించిన పార్టీ నుంచి వడి వడిగా అడుగులు వేస్తే ఈ స్థాయికి చేరుకోవడం సాధరమైన విషయం కాదన్నారు. ఎన్నో ఆటు పోట్లు తిని ఎంతో పద్దతిగా కష్టపడి పార్టీని ఈ రోజు వరకుప్రణాళికతో ముందుకు నడిపిస్తున్న ఉద్యమ సారధి కేసీఆర్ అడుగుజాడల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందన్నారు. 2001నుంచి 2014వరకు ఉద్యమ రధసారధిగా ఉన్న కేసీఆర్ కేవలం ఉద్యమానికి కేటాయించి రాష్ట్ర సమస్యలను పరిష్కరించే తరిఖాను వివరించారు. నమ్మినప్రజలు అత్యధిక ఓట్ల మెజార్టీతో తెరాసను గెలిపించారని ఆ నమ్మకాన్ని ఏమాత్రం తగ్గకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమం, విద్య, వైద్యం, సాగు, తాగునీరు రైతులు, కార్మికులు ఇలా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో సాగు, తాగునీరు కష్టాలను తీర్చేందుకు అపర భగీరథునిగా సీఎంకేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సుమారు 200 కేసులు న్యాయస్థానంలో వేసి కుట్రలు చేశారని గుర్తు చేశారు. ఇలా కేసులు గెలుచుకుని ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా చేశామన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి పూర్తి చేసి ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించేప్రాజక్టులు శరవేగంగానిర్మాణం జరుగుతున్నాయని దీనిని ప్రజలు గమనించారు కాబట్టే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చారని దీని కారణంగానే తిరిగి ప్రజలు తెరాసకు అధికారం అందించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా ప్రవహిస్తున్న కృష్ణ, గోదావరి నదుల నీళ్లను ఒడిసి పట్టి రాష్ట్రప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని దీనికి అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు వరసలో ఉందన్నారు. ఇలాంటి అభివృద్ధి సంక్షేమపథకాలు రాష్ట్రంలో కొనసాగిస్తున్న పార్టీ కార్యకర్తలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు కట్టుబడి పని చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు బాధ్యతగా నిర్వహించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ఖమ్మంలో సభ్యత్వ నమోదును ప్రథమంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందించారు. అనంతరం ఎమ్యెల్యే పువ్వాడ అజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్ నిలిచిందన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజక వర్గ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వం పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ ఇచ్చిన లక్ష్యం కంటే అందనంగానే సభ్యత్వాలు పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో 17 వేల క్రియాశీలక సభ్యత్వాలు లక్ష్యంగా ఉందని దీనిని నాయకులు విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు. రఘునాథపాలెంలో గ్రామ గ్రామనా, నగరంలో ప్రతి డివిజన్‌లో ప్రతి కార్పొరేటర్ సభ్యత్వలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని తెలిపారు. పది రోజుల పాటు డివిజన్లలో సభ్యత్వాలను పెద్ద ఎత్తున పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు టీఆర్‌ఎస్ కృషి చేస్తుందన్నారు. పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేయాలన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. సభ్యత్వపుస్తకాలు జూన్ 10వతేదీ వరకు పంపించాలని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్‌బత్తుల మురళీ, రైతు సమన్వయసమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు కమర్తపు మురళి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles