సభ్యత్వ నమోదును వేడుకలా నిర్వహించాలి..

Tue,July 2, 2019 03:13 AM

-టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు
ఎర్రుపాలెం, జూలై1: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును గ్రామగ్రామాన వేడుకలా నిర్వహించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. ఎర్రుపాలెంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతిఒక్కరూ బాధ్యతగా తమతమ నిర్ధేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తిచేయాలన్నారు. మండలంలో 10 వేల సభ్యత్వాలను లక్ష్యంగా పూర్తి చేయాలన్నారు. సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన కార్యకర్తలు, నాయకులకు పార్టీ సముచితస్థానం కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందన్నారు. సభ్యత్వాల నమోదుతో గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేసే దిశగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. నూతనంగా నిర్మించే ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం కానుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. ఇప్పుడు చేపట్టిన సభ్యత్వ నమోదులతో రికార్డుస్థాయిలో టీఆర్‌ఎస్ గ్రామగ్రామాన బలపడబోతుందన్నారు. ఈనెల 10 లోపు సభ్యత్వ నమోదును ప్రతిఒక్కరు పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, భద్రాచలం ట్రస్టుబోర్డు మాజీచైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మండల రైతుసమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యురాలు వేమిరెడ్డి త్రివేణి, టీఆర్‌ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, మండల యూత్ అధ్యక్షుడు సేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఇనపనూరి భాస్కర్‌రావు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles