భద్రాద్రి రాముని హుండీ లెక్కింపు..

Tue,July 2, 2019 03:13 AM

-రూ.1కోటి 9లక్షలకు పైగా ఆదాయం
భద్రాచలం, నమస్తే తెలంగాణ జూలై1: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి హుండీ ఆదాయాన్ని స్థానిక చిత్రకూట మండపంలో లెక్కించారు. రూ.1,09,64,015ల నగదు లభించింది. బంగారం 125గ్రాములు, వెండి 1కేజీ 500ల గ్రాములు రాగా, ఓమన్ బైసాలు 100, యూఏఈ 10 దిరామ్స్, యూఎస్‌ఏ డాలర్లు 154, న్యూజిల్యాండ్ డాలర్లు 15, నేపాల్ రూపాయలు 10, ఖతార్ రియాల్స్ 106, సౌది రియాల్స్ 5, కువైట్ దినార్లు 10, సింగపూర్ డాలర్లు 10 లభించాయి. ఈ హుండీ లెక్కింపు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు ఈ లెక్కింపులో పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles