మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Wed,June 26, 2019 01:23 AM

-కంతానపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణస్వామి
పాల్వంచ రూరల్: పంచాయితీ కార్యదర్శులు కష్టపడి మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కంతానపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణస్వామి అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో కేవలం 500 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, పంచాయతీ కార్యదర్శులు వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చేనెల 10వ తేదీ లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకొని లక్ష్యాన్ని సాధించాలని స్పష్టం చేశారు. కొన్ని పంచాయతీలు ఓడీఎఫ్ సాధించాయని, ఆ పంచాయతీల కార్యదర్శులు తమ సమీప పంచాయతీల్లోని నిర్మాణాలకు సహకరించాలన్నారు. పంచాయతీల్లో నిర్మాణాలు ఓకేసారి ప్రారంభిస్తే.. పనులు కూడా క్రమపద్దతిలో జరుగుతాయని, లబ్ధిదారులను ప్రోత్సహిస్తే వారు వేగంగా నిర్మాణాలను పూర్తి చేసుకుంటారన్నారు. యువ పంచాయితీ కార్యదర్శులు పనిపట్ల శ్రద్ధ వహిస్తే ప్రభుత్వ లక్ష్యం త్వరగా నెరవేరుతుందన్నారు. ఎంపీడీవో అల్బర్ట్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఎవరికి ఎన్ని మొక్కలు కావాలో ఒక ప్రణాళికను సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు తదిర ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇతర అధికారులు రంగారావు, రమాకాంత, రేవతి, ఏపీఎం రాంబాబు, ఏపీవో రంగా పాల్గొన్నారు. దంతెలబోరల విద్యార్ధుల ర్యాలీ.. ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని కోరుతూ.. దంతెలబోర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎం మల్లెంపాటి వెంకటేశ్వరావు, ఉపాధ్యాయులు బాబూరావు, మంగిలాల్, శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles