పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం

Wed,June 26, 2019 01:23 AM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు పేదల అభ్యున్నతికి బాటలు వేస్తున్నాయని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.1.72 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 182 మంది లబ్ధిదారులకు, రూ.25.5 లక్షలు విలువ చేసే బీసీ కార్పొరేషన్ చెక్కులను 51 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు మంజూరు చేస్తూ ఆయా కుటుంబాల వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేస్తూ దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. సీతారామ ప్రాజెక్టు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మితమవుతుందన్నారు. రానున్న రోజుల్లో ఇప్పటివరకు అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యకు కూడా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని స్పష్టం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ పులిగళ్ళ మాధవరావు, జడ్పీటీసీ చండ్ర అరుణ, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జాఫర్‌ఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles