క్రీడలతోనే మానసిక ఉల్లాసం

Wed,June 26, 2019 01:22 AM

-భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్
భద్రాచలం, నమస్తే తెలంగాణ : గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల కళాశాలలు, పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆట విడుపుగా చెస్ (చదరంగం) క్రీడలు నేర్పించి వారిలోని ప్రతిభా పాఠవాలు వెలికి తీయాలంటే ఇటువంటి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పీఎంఆర్‌సీ భవనంలో పీడీలు, పీఈటీలకు చెస్ (చదరంగం) క్రీడపై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని పీవో సందర్శించారు. ఈ సందర్భంగా చెస్ క్రీడలపై పీడీలు, పీఈటీలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పీవో మాట్లాడుతూ..దేశంలో అన్ని రకాల క్రీడలతో పాటు చెస్ క్రీడకు మంచి ప్రాచుర్యం ఉందన్నారు. ఇటువంటి క్రీడలను పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నేర్పిస్తే వారు చదువుతోపాటు క్రీడల్లో కూడా పాల్గొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగి వారి కుటుంబాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారన్నారు. ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందుతున్న పీడీ, పీఈటీలు చెస్ గురించి తెలుసుకోవాలన్నారు. కొత్తవారు ఎవరైనా ఉంటే చెస్ గురించి అవగాహన ఉన్నవారు బ్యాచ్‌ల వారీగా కూర్చోని వారికి అర్థమయ్యేల మెళకువలు నేర్పించాలని పీవో తెలిపారు. రెండు రోజులు శిక్షణ తీసుకున్న పీడీ, పీఈటీలు తప్పకుండా వారి పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు నేర్పించాలన్నారు. క్రీడల అధికారి పుట్టా శంకర్‌కు పీవో సూచించారు. ఖమ్మం జిల్లాలోని నాలుగు డిగ్రీ కాలేజీలు, 6 జూనియర్ కాలేజీలు, యూఆర్‌జేసీ 6 పాఠశాలలు, 2 ఏఎంఆర్ స్కూల్స్ నుంచి 29మంది పీడీ, పీఈటీలు పాల్గొన్నారని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మీ పీవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌సీ కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా పీడీ, పీఈటీ, పీఎంఆర్‌సీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles