నలుగురు బైక్ దొంగల అరెస్ట్

Wed,June 26, 2019 01:21 AM

కొత్తగూడెం క్రైం: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నలుగురిని మంగళవారం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కన్నం కుమారస్వామి వెల్లడించిన వివరాలు.... గత ఆరు నెలలుగా దిచక్ర వాహనాలను దొంగలిస్తూ వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తున్న ముఠాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందు కోసం పట్టణంలో నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోస్టాఫీస్ సెంటర్‌లో ఉదయం 6.00 గంటలకు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని గోరంట్ల రమేష్, చీమట నరేష్, ఎస్‌కె.ఇస్మాయిల్, మాలోతు కిషన్‌గా గుర్తించారు. వారి నుంచి జూలూరుపాడులో చోరీ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను, మరో రెండు వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. స్వాధీనపరుచుకున్న ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఇంజన్ నెంబర్ల ద్వారా బాధితులకు సమాచారం అందించి, కోర్టు ద్వారా అప్పగిస్తామని చెప్పారు.దొంగలను పట్టుకునేందకు కృషి చేసిన ఎస్సైలు పండగ తిరుపతి రావు, దేశం రాఘవయ్యలను అభింనందించారు. సమావేశంలో పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles