ప్రజలపార్టీ టీఆర్‌ఎస్

Tue,June 25, 2019 02:03 AM

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :రాబోయే వందేళ్లపాటు చరిత్రలో నిలిచిపోయేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన ఉన్న ఎకరం స్థలంలో సోమవారం జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జ్ నూకల నరేశ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు సభలో కోరం కనకయ్య మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ భవిష్యత్‌లో పార్టీ నిర్మాణానికి కార్యచరణ రూపొందించారని, అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు.

గడపగడపకూ అభివృద్ధి ఫలాలు అందేలా పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి బీడు భూములను సశ్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకున్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా భవిష్యత్ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగిస్తుందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ తిరుగులేని నాయకుడని, ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపని, విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు పార్టీ జిల్లా కార్యాలయాన్ని వచ్చే దసరానాటికి పూర్తి చేసి కార్యకర్తలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బరపాటి వాసుదేవరావు, మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, పార్టీ భద్రాచలం ఇన్‌చార్జ్ తెల్లం వెంకట్రావ్, జిల్లా వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు పులి గీత, మడత రమ, నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, శిశు సంక్షేమశాఖ రీజినల్ కోఆర్డినేటర్ తూతక నాగమణి, బిక్కసాని నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు గిడ్ల పరంజ్యోతిరావు, కాసుల వెంకట్, ఎం రజాక్, తొగరు రాజశేఖర్, తూము వెంకటేశ్వర చౌదరి, ఆళ్ల మురళీ, బండి రాజుగౌడ్, సత్యనారాయణ సింగ్(సత్తు భయ్యా), కనుకుంట్ల శ్రీను, కే వాసు, మడత వెంకట్‌గౌడ్, మంతపురి రాజుగౌడ్, సకినాల వెంకన్న, రుక్మాంగధర్ బండారి, బత్తుల వీరయ్య, దుంపల రాజేష్, తిప్పన సిద్దులు, పైడి వెంకటేశ్వరరావు, కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు మోరె భాస్కర్‌రావు, కే ధర్మరాజు, వై శ్రీనివాసరావు, గోబ్రియానాయక్, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రైతాంగానికి అధిక ప్రాధాన్యం : నూకల నరేశ్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతాంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారని, కోటి ఎకరాల మాగాణికి కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, నాగార్జునసాగర్ కెనాల్స్ ద్వారా సాగునీరందించేందుకు బృహత్తర కార్యక్రమాలు రూపొందించారని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి అన్నారు. మొదటి నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని రెట్టింపు చేస్తున్నారన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని, పార్టీ సంక్షేమం కోసం ప్రతీ జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు రూ.60లక్షల నిధులను ఇచ్చారని తెలిపారు. దసరా నాటికి పార్టీ కార్యాలయాలు పూర్తి చేస్తారని, ప్రతీ గ్రామంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు అడుగులు వేయాలన్నారు. పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు వారం రోజులపాటు కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తోంది : ఎమ్మెల్యే వనమా
ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని, పార్టీ బలోపేతానికి కూడా ప్రజలు సహకరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించారని, రైతాంగానికి సాగు, తాగునీరు అందించి రెండు పంటలకు నీరిచ్చేలా కృషి చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు వరంలాంటిదని చెప్పారు. కేంద్రం నుంచి సాయం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, మళ్లీ 25సంవత్సరాలు సీఎంగా కేసీఆరే ఉంటారన్నారు. కార్యకర్తల కృషితోనే ఇటీవల ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, చివరికి పార్లమెంట్ వరకు స్థానాలకు కైవసం చేసుకుందన్నారు. భవిష్యత్‌లో పేదవాళ్లు లేని గ్రామం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రతీగడపకు చేరాలి : పినపాక ఎమ్మెల్యే రేగా
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, అందువల్లనే సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా చేశారని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ గడపకు చేరేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఎన్నికల్లో విజయఢంకా మోగించారని అన్నారు. సంస్థాగత నిర్మాణం కోసం దృష్టి సారించిన కేసీఆర్ తిరుగులేని నాయకుడని, పార్టీ కార్యకర్తల అభివృద్ధి కోసం జిల్లాకో కార్యాలయానికి నిధులు మంజూరు చేశారన్నారు.

అలుపెరుగని పోరాట నాయకుడు సీఎం కేసీఆర్ : ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ
అలుపెరుగని పోరాట నాయకుడు సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమంతో పాటు, పార్టీ, కార్యకర్తల భరోసా కోసం పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారని, ఈ కార్యాలయం దేవాలయంతో సమానమని ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, ప్రతీ కార్యకర్తను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారన్నారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి : ఎమ్మెల్సీ బాలసాని
టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న ప్రతి ఒక్కరికీ కార్యాలయం ఒక ఆశ్రయంగా ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం 29జిల్లాల్లో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఉద్యమం నుంచి పార్టీని బలోపేతం చేసేందుకే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త సహకరించాలన్నారు. ఉద్యమంలో ఎన్ని లాఠీలు విరిగినా ఉద్యమాన్ని నడిపించిన సీఎం కేసీఆర్ రాష్ట్రం సాధించిన చరిత్రలో నెంబర్‌వన్‌గా నిలిచిపోయారన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి : పార్టీ రాష్ట్ర నాయకుడు రాఘవేందర్‌రావు
సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధిలోకి వస్తుందని, భవిష్యత్‌లో జిల్లా అంతా గులాబీమయం అవుతుందని పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు అన్నారు. పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కట్టుబడి పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles