పాలిటెక్నిక్‌తో ఉజ్వల భవిష్యత్తు

Tue,June 25, 2019 02:00 AM

నమస్తే తెలంగాణ, సత్తుపల్లి, జూన్ 24: పాలిటెక్నిక్ విద్యనభ్యసించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పాలిటెక్నిక్ ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్ నాగముని నాయక్ అన్నారు. ఉన్నత విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో రాణించేందుకు పాలిటెక్నిక్ విద్య మంచి నిర్ణయమని ఆయన అన్నారు. సోమవారం స్దానిక మదర్‌ధెరిస్సా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. టెక్నికల్ విద్యలో పాలిటెక్నిక్ కోర్సు అతి త్వరగా జీవితంలో స్దిరపడేందుకు ఓ అద్బుత అవకాశం అని, ఉన్నత విద్యలో రాణించాలన్నా ఈ సెట్ ద్వారా బీటెక్ రెండవ సంవత్సరంను అత్యున్నత సంస్థలో సీటు సాధించే వీలుందన్నారు. పాలిటెక్నిక్ విద్యలో క్రమశిక్షణ, మెళుకువలతో కూడిన మదర్‌ధెరిస్సా వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇటువంటి కళాశాలను విద్యార్థులు ఎంచుకోవడం మంచి నిర్ణయమన్నారు. ఈ సందర్భంగా నాణ్యమైన విద్యను భవిష్యత్ ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కనబరుస్తూ దేశ ప్రగతికి పాటు పడాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ద్వితీయ, తృతీయ సంవత్సరంలో ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చలసాని హరీశ్ మాట్లాడుటూ ఎస్‌బీటీఈటీ గైడ్‌లైన్స్‌ను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, చైర్మన్ కంచర్ల సత్యనారాయణ, డిప్లొమా డీన్ డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, హెచ్‌వోడీ, అధ్యాపకులు డాక్టర్ కే నాగేశ్వరరావు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles