ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం..

Tue,June 25, 2019 01:58 AM

వైరా, నమస్తే తెలంగాణ, జూన్24: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పని చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని రెబ్బవరంలో హరిజనవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. రెబ్బవరం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు తాళ్లూరి సతీష్‌కుమార్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి రూ.15లక్షలు వితరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములునాయక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. ముందుగా గ్రామస్థులు ఎమ్మెల్యేకు డప్పువాయిద్యాలతో ఘనస్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తుందన్నారు. రెబ్బవరం గ్రామానికి చెందిన తాళ్లూరి సతీష్‌కుమార్ స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి రూ.15లక్షలు వితరణ ఇవ్వడం అభినందనీయమన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన సతీష్‌కుమార్‌కు నిరుపేద విద్యార్ధులు పడే కష్టాలు తెలుసునని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తూ వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని తన సొంత గ్రామానికి చేయూతనందించాలనే లక్ష్యంతో కేటాయించడం అభినందనీయమన్నారు. పాఠశాలలో రెండు గదుల నిర్మాణంతో పాటు ప్రహరీ నిర్మాణానికి రూ.15లక్షలు వితరణ ఇవ్వడం గర్వకారణమన్నారు. అదేవిధంగా గ్రామంలో దేవాలయం నిర్మాణానికి, ఇతర నిర్మాణాలకు సతీష్‌కుమార్ లక్షలాది రూపాయలను వితరణగా ఇచ్చారన్నారు. ఇలాంటి సహృదయం ఉన్నదాత సతీష్‌కుమార్ నియోజకవర్గంలో ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలకు గ్రామస్థులు సతీష్‌కుమార్ తండ్రి రాఘవయ్య పేరు పెట్టడం అభినందనీయమన్నారు. రెబ్బవరం గ్రామాభివృద్ధికి ఆర్థికంగా చేయూతనందిస్తున్న తాళ్లూరి సతీష్‌కుమార్‌ను యువతీ, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తాళ్ళూరి సతీష్‌కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాములునాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు, సర్పంచ్ సాదం రామారావు, ఎంపీటీసీ రాయల రమేష్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్‌రావు, నాయకులు మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్, బండారు తిరుపతిరావు, ప్రధానోపాధ్యాయుడు శివన్నారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్ వేల్పుల కృపామణి, ధాత తాళ్లూరి సతీష్‌కుమార్, తాళ్లూరి నర్సింహారావు, తాళ్లూరి లక్ష్మీకాంతం, తాళ్లూరి రమణమ్మ, వై.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో భావితరాలకు బంగారు భవిష్యత్తు అందిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరా మండలంలోని రెబ్బవరంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలతోనే మానవుని మనుగడ ముడిపడి ఉందన్నారు. అడవులను నరకడం వలన పర్యావరణం దెబ్బతిని ఎండవేడిమి పెరిగిపోతుందని అన్నారు. గడిచిన ఐదేళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం నాటిన మొక్కలతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles