సంక్షేమ హాస్టళ్లలో సకల సౌకర్యాలు

Mon,June 24, 2019 05:05 AM

మామిళ్లగూడెం : గతంలో సంక్షేమ వసతి గృహాలంటే పురుగుల అన్నం.. నీళ్ల చారు.. దుర్ఘంధం వెదజల్లే పరిసరాలు.. దోమలు, పందులు, ఈగల మోతలతో నిత్యం సమస్యలకు నిలయాలుగా ఉండేవి.. అది ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల దుస్థితి.. కానీ పోరాటలతో పురుడు పోసుకున్న స్వరాష్ట్రం తెలంగాణలో సంక్షేమ వసతి గృహాలు అంటే పిల్లలకు సన్న బియ్యంతో భోజనం, రుచి కరమైన, సంతులిత కూరలు, నిత్యం గుడ్డు, వారంలో ఒక రోజు మాంసాహారం, పరుశుభ్రమైన వాతావారణంతో పిల్లలకు ఆహ్లాదాన్ని పంచే నిలయాలుగా అభివృద్ధి చెందాయి. అధికారుల నిరంతర పర్యవేక్షణ, పిల్లల పోషణకు పెద్దపీఠ వేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి. గతంలో సంక్షేమ వసతి గృహాలు అంటే పిల్లలు ఆమడ దూరంగా ఉండే వారు. నేడు పెరిగిన మెరుగైన సౌకర్యాలతో విద్యార్థులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులు దుప్పట్లు, దుస్తులు, నోటుపుస్తకాలు, ఇతర వస్తువులు అందిస్తున్నారు.

పదోతరగతిలో ప్రతిభ...
వసతి గృహాల్లో చదువుకున్న 10వ విద్యార్థులు 93.61 శాతం ఉతీర్ణత నమోదు చేశారు. 10/10 జీపీఏ ఒక విద్యార్థి సాధించగా 9.5 జీపీఏ 15 మంది, 9.0 జీపీఏ 41 మంది విద్యార్థులు సాధించారు. 23 బీసీ సంక్షేమం వసతి గృహాల్లో విద్యార్థులు 90.14 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఉంటూ పదోవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు 92.23 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

తల్లిదండ్రుల్లో చైతన్యం..
పది తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వసతి గృహాల్లో అందిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇప్పటికే పల్లెబాట పట్టిన పలువురు వసతి గృహ సంక్షేమ అధికారులు వసతి గృహాలలో పిల్లలకు కల్పిస్తున్న వసతి, వారి సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తున్నారు.

మెరుగైన విద్య సౌకర్యాలు కల్పిస్తాం..
హాస్టళ్లలో సౌకర్యాల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే కరపత్రాలతో అన్ని శాఖల వసతి గృహాల సంక్షేమ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో విద్యార్థులకు మరింత సేవలు అందిస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం పర్యవేక్షణతో క్రమశిక్షనతో చదువుకునేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేస్తాం. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మెనూ అమలు పకడ్బందీగా చేస్తాం.
-జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ

మెరుగైన మెనూ...
ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన మెనూ అందిస్తున్నారు. సంక్షేమ శాఖల వసతి గృహాల్లో అందిస్తున్న మెను వివరాలు ఇలా..
-సోమవారం ఉదయం 6గంటలకు పాలు, బెల్లంతో రాగిజావ, 8గంటలకు కిచిడి, రసం, అరటి పండు, మధ్యాహ్నం పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు బిస్కెట్లు, రాత్రి.. కూరగాయలతో కూర, సాంబారు, పెరుగు, గుడ్డు.
-మంగళవారం ఉదయం 6గంటలకు పాలు బెల్లంతో రాగిజావ, 8గంటలకు గోదుమరవ్య ఉప్మా, చట్ని, అరటి పండు, పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు బొబ్బర్ల గుగ్గిళ్లు, రాత్రి భోజనంలో ఆకుకూర పప్పు, రసము, పెరుగు, గుడ్డు.
-బుధవారం ఉదయం 6గంటలకు పాలు, బెల్లంతో రాగిజావ, 8గంటలకు పులిహోర, అరటి పండు, పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు పల్లిపట్టి, రాత్రి భోజనంలో కూరగాయల కూర, సాంబారు, పెరుగు, గుడ్డు.
-గురువారం ఉదయం 6గంటలకు పాలు, బెల్లంతో రాగిజావ, 8గంటలకు బొంబాయిరవ్వ ఉప్మా, చట్నీ, అరటి పండు, పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు శనగ గుగ్గిళ్లు, రాత్రి భోజనంలో ఆకుకూర పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు.
-శుక్రవారం ఉదయం 6గంటలకు పాలు, బెల్లంతో రాగిజావ, 8గంటలకు ఆలు బిర్యానీ, మధ్యాహ్నం పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు బిస్కెట్లు, రాత్రి భోజనంలో కూరగాయల కూర, సాంబారు, పెరుగు, గుడ్డు.
-శనివారం ఉదయం 6గంటలకు పాలు, బెల్లంతో రాగిజావ, 8గంటలకు పులిహోర, అరటి పండు, మధ్యాహ్నం పాఠశాలలో భోజనం, సాయంత్రం 5గంటలకు పెసర గుగ్గిళ్లు, రాత్రి భోజనంలో ఆకుకూర పప్పు, సాంబారు, పెరుగు, గుడ్డు.
-ఆదివారం ఉదయం 6గంటలకు పాలు బెల్లంతో రాగిజావ, 8గంటలకు ఇడ్లీ, చట్నీ, సాంబారు, మధ్యాహ్నం బగార అన్నం, చికెన్ కర్రీ, రైతా, సాంబారు, సాయంత్రం 5గంటలకు మరమరాలు లేదా అటుకులు, రాత్రి భోజనంలో అన్నం, కూరగాయలకూర, సాంబారు, పెరుగు అందిస్తున్నారు.
-కళాశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు వారంలో రెండు రోజులు చికెన్, నాలుగు రోజులు గుడ్డు పెడతారు.

వసతి గృహాల్లో సౌకర్యాలు...
పాఠశాల స్థాయి వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులకు వసతి గృహాల్లో మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నారు.
-ప్రతి విద్యార్థికి తరగతుల వారీగా సరఫడా నోటు పుస్తకాలు
-ప్రతి విద్యార్థికి బెడ్, పరుపు సౌకర్యం
-భోజనం కోసం ప్రత్యేక డైనింగ్ టేబ్సు వసతి
-ప్రతి విద్యార్థికి నాలుగు జతల బట్టలు, రెండు దుప్పట్లు, ట్రంకుపెట్టె, స్టీలు గ్లాసు, స్టీలు ప్లేటు, చెప్పులు, బూట్లు, స్కూల్ బ్యాగ్
-ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, సోలార్‌తో ఇన్వర్టర్
-ప్రతి నెల డాక్టర్లతో వైద్య పరీక్షలు
-విద్యార్థులకు ఉదయం, రాత్రి ప్రత్యేక తరగతులు
-ఫ్యూరిఫైడ్ తాగునీటి సౌకర్యం కల్పిస్తారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles