పోలీస్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి

Sun,June 23, 2019 02:44 AM

కొత్తగూడెం క్రైం : పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపికకోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ శనివారం నాటికి ప్రశాంతంగా ముగిసింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి మొదలైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని సీఈఆర్ క్లబ్‌లో జరిగిన ఈ వెరిఫికేషన్‌కు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయినట్లు ఆయన తెలిపారు. రోజుకు సుమారు 800 మంది అభ్యర్థుల చొప్పున ఈ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా జరిపినట్లు తెలిపారు. మొదటి 7రోజుల ప్రక్రియ పురుష అభ్యర్థులు, రెండు రోజల ప్రక్రియ మహిళా అభ్యర్థులకు నిర్వహించి పూర్తి చేశామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొత్తం 6,360మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉండగా, 5,224మంది హాజరైనట్లు ఆయన స్పష్టం చేశారు. 60మంది అభ్యర్థులను మాత్రం వెరిఫికేషన్ ప్రక్రియ కోసం హైదరాబాద్ పంపించినట్లు తెలిపారు. 1076మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు గైర్హాజరయ్యారన్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం భద్రాచలం ఏఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఐటీ సెల్ సిబ్బంది సహకారంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామన్నారు. అభ్యర్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేశారని, వారి కృషి అభినందనీయమమన్నారు. ఈ ప్రక్రియలో అర్హులైన అభ్యర్థుల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles