మరుగుదొడ్డి నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Sun,June 23, 2019 02:43 AM

మణుగూరు, నమస్తే తెలంగాణ : ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మారుమూల గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. ఆయన శనివారం మణుగూరు మండలంలోని సమితిసింగారం, కూనవరం, రామానుజవరం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓడీఎఫ్ కింద మరుగుదొడ్లు ఎంత మంది నిర్మించుకున్నది పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి పైకం అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోకుండా ఉన్న ఇంటి వద్ద ముగ్గుపోయించి తవ్వించి వెంటనే పనులు ప్రారంభించాలని ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రభలి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, దేశప్రధాని సంకల్పించి ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అందుకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతిఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ప్రతిఒక్క అధికారి, సంబంధిత ఎంపీడీవోలు సామాజిక బాధ్యతగా చొరవ తీసుకొని గ్రామసర్పంచ్‌లను సంప్రదించి వచ్చేనెల 10లోపు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకొని ఓడీఎఫ్ గ్రామాలుగా జిల్లా మొదటిస్థానంలో ఉండేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో స్పెషల్ ఆఫీసర్ విద్యాలత, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అరుంథతి, పీఆర్ ఏఈ రామారావు, వీఆర్‌వోలు, అంగన్‌వాడీ టీచర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మణుగూరులో తాపీ మేస్త్రీలు మరుగుదొడ్ల నిర్మాణాలకు సహకరించాలి
మణుగూరు మండలంలోని సమితిసింగారం, రామానుజవరం, కూనవరం గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో చాలా వెనుకబడి ఉన్నారని, మండలంలోని తాపీమేస్త్రీలు నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. పది రోజులపాటు సామాజిక బాధ్యతగా ప్రజలు మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేవరకు తాపీ మేస్త్రీలను తమ పనికి పిలవకుండా సహకరించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతిఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకున్నారని, మన జిల్లాలోని మణుగూరు మండలం వెనుకబడడం జరిగిందని ఆయన తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles