యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు

Sat,June 22, 2019 01:20 AM

-సింగరేణి ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమం
కొత్తగూడెం సింగరేణి : భారతీయ యోగాకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం అన్నారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం సింగరేణి కార్పొరేట్ ఏరియా కొత్తగూడెం హెడ్డాఫీస్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు నిర్వహించిన యోగా రన్‌ను వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యోగా ఆరోగ్య సంజీవని అని, విదేశాలలో కూడా మన యోగాను ఆచరిస్తున్నారన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆలోచనలు ఆదేశాలతో రూపొందించిన మీ కోసం మీ ఆరోగ్యం కోసం, ఇంటింటికి యోగా శిక్షణ కార్యక్రమం ద్వారా వేలాది మంది సింగరేణీయుల అనేక జబ్బులు నయం అయ్యాయన్నారు. ఈ సందర్భంగా జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో వందల సంఖ్యలో సింగరేణీయులు, వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం పర్సనల్ కే బసవయ్య, టీబీజీకేఎస్ నాయకుడు జాన్ అజిత్, సీఎంవోఏఐ అధ్యక్షుడు ఎంఆర్‌జీకే మూర్తి, జీఎం సెక్యూరిటీ ప్రేంకుమార్, డీజీఎం పర్సనల్ సాల్మోన్ పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles