ఓడీఎఫ్ లక్ష్యం చేరేవరకు సెలవులు రద్దు

Sat,June 22, 2019 01:16 AM

అశ్వారావుపేట టౌన్, జూన్ 21: జిల్లాను అనుకున్న సమయం కల్లా ఓడీఎఫ్‌గా ప్రకటించే వరకు మండల, గ్రామ స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలనుసారం సెలవులు రద్దుచేయటం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత స్పష్టం చేశారు. మరుగుదొడ్డి నిర్మాణాలు నూటికి నూరు శాతం పూర్తి చేసే బాధ్యత పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులదేనన్నారు. గ్రామాలలో నిరంతరం పర్యటటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.శుక్రవారం సాయంత్రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో అధికారులతో ఎస్‌బీఎం పై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో పది మండలాల్లో ఎస్‌బీఎం టార్గెట్ ఎక్కువగా ఉన్నాయని వాటిపై ప్రధాన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.

మండలంలో మరుగుదొడ్డి నిర్మాణాల ప్రగతి మెరుగ్గా ఉందని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. జూలై మొదటి కల్లా మరుగుదొడ్డి నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిరంతరం గ్రామాలో పర్యటించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అవసరమైతే మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు రాని వారి రేష్‌న్, పించన్, పంచాయతీ,రెవిన్యూ దృవపత్రాలను నిలిపివేయాలని ఆదేశించారు. సెర్ప్ నుండి స్త్రీ నిది రుణాలను సైతం ఆపివేయాలని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా అందించే బాలికా సంరక్షణతో పాటు ఇతర పథకాలను నిలుపుదల చేయాలని ఆదికారులకు ఆదేశించారు. సమావేశంలో ఎంసీడీఓ కే పాపారాణి, ఈఓపీఆర్‌డీ ఒంటేరు దేవరాజ్, సీడీపీఓ అన్నపూర్ణ, సెర్ప్ ఏపీఎం ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఈజీఎస్ ఏపీఓ శ్రీనుతో పాటు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles