ఆర్‌టీసీ బస్సులో సైకో వీరంగం

Sat,June 22, 2019 01:13 AM

దమ్మపేట: ఆర్టీసీ బస్సులో, ఓ సైకో కత్తితో వీరంగం సృష్టించాడు. మహిళా కండక్టర్‌పై, ప్రయాణికులపై కత్తితో దాడికి యత్నించాడు. మండలంలోని మందలపల్లి-ముష్టిబండ మధ్యన శుక్రవారం ఇది జరిగింది. ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి తెలిపిన వివరాలు... శుక్రవారం అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న ఆర్‌టీసీ బస్సు, మందలపల్లి బస్టాప్ వద్ద ఆగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు హరిసింగ్ ఎక్కాడు. అతడికి కండక్టర్ ధనలక్ష్మి టికెట్ ఇచ్చి, డబ్బు అడిగారు. దీనికి సమాధానంగా... అతడు కత్తితో ఆమెను బెదిరించడంతోపాటు దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయటంతోనే అతడు కత్తితో వీరంగమేస్తూ బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికులు వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. అతడి రెండు చేతులను వెనక్కి కట్టేసి, పోలీసులకు అప్పగించారు. అతడి వద్దనున్న కత్తులను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. కండక్టర్‌పై దాడి చేసే ప్రత్నంలో అతడికే గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. కండక్టర్ ధనలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles