కాలేశ్వర గంగ.. గలగల..!

Fri,June 21, 2019 02:07 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఒక అద్భుతం...కాదు..కాదు.. మహాద్భుతం.. తెలంగాణ నేలపై ఆవిష్కరించేందుకు కొన్ని గంటలే మిగిలింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి మాటలను అక్షరాల వాస్తవ రూపం దాల్చే మహా యజ్ఞానికి నాటి ఉద్యమ నేత, నేటి పరిపాలకుడు, అపర భగీరథుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. సాగునీరు లేక పొట్టచేత పట్టుకుని బతుకుదెరువుకోసం దేశం కాని దేశాలు వెళ్లిన వేల మంది తెలంగాణ బిడ్డలు తిరిగి తమ సొంత స్థలాలకు పయనమయ్యారు. తెలంగాణలోని ప్రతి బిడ్డ సంబురాలు జరుపుకోనున్నారు. ప్రపంచంలోనే ఎత్తిపోతల పథకాలలో అతిపెద్దది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇంత పెద్ద పథకాన్ని కేవలం మూడెండ్ల కాలంలోనే నిర్మించి ఇవ్వాల ప్రారంభించబోతున్న సందర్భాన తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబురాలకు సిద్ధమైంది.సీఎం కేసీఆర్ మరో కాటన్‌గా చరిత్రను సృష్టించబోతున సమయాన తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. కాళేశ్వరం ప్రారంభించగానే జిల్లాలోని అన్ని గ్రామాలలో బాణా సంచ కాల్చి మిఠాయిలు పంచుకునేల టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్....ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
సాధించుకున్న తెలంగాణను బం గారు తెలంగాణగా నిర్మించడమే ల క్ష్యం గా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేవ లం మూడేండ్ల సమయంలోనే నిర్మించడం మహాద్బుతం. సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు నియామకాలను కూడా చేపట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్. కాళేశ్వరం ద్వారా ఎండిన 45 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే మహోన్నత గట్టం నేడు ఆవిష్కృతం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాళేశ్వరం స్ఫూర్తితో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించి ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం. నేడు జరిగే సంబురాలలో ప్రజలందరూ పాల్గొన్నాలని పిలుపునిస్తున్నాను.

ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం: పాలేరు ఎమ్మెల్యే,కందాల ఉపేందర్‌రెడ్డి
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్ర పంచంలోని అతిపెద్దది. సీఎం కేసీఆర్ కృషితో అనతికాలంలో నిర్మించి చరిత్ర లో రికార్డు సృష్టించారు.రూ.80వేల కోట్లతో నిర్మించిన దేశంలోనే మొదటి అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు 13 జిల్లాలో 18లక్షల ఎకరాల భూమిని పండించడం కోసం సీఎం కేసీఆర్ అవిరాలం గా కృషి చేశారు.145 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇది తెలంగాణకు వరప్రదాయినిగా నిలువనుంది. తెలంగాణ భూముల్లో సిరులు పండ నున్నాయి. రైతులు ఆనందంలో ఉన్నారు.
సీఎంకు సమ్మక్క-సారలమ్మ దీవెనలు పుష్కలంగా ఉంటాయి... :రేగా కాంతారావు, పినపాక ఎమ్మెల్యే
తెలంగాణ పోరాట యోధుడు... బం గారుతెలంగాణ స్వాప్నికుడు సీఎం కే సీఆర్‌కు ఆదివాసీల ఆరాధ్యదైవం సమ్మ క్క-సారలమ్మ దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సీఎం కేసీఆర్‌కు భద్రాద్రి రాముడు, సమ్మక్క -సారలమ్మ ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కలగాలి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును అతితక్కువ సమయంలో పూర్తి చేసి రైతాంగానికి అందుబాటులోకి తెచ్చిన సీఎం కేసీఆర్‌కు యావత్ తెలంగాణ రైతాంగం రుణపడి ఉంటుంది. నా నియోజకవర్గ ప్రజలకు ఊరూరు, వాడవాడలా సంబురాలు జరుపుతున్నాం.

చరిత్రలో నిలిచిపోయేది కాళేశ్వరం ప్రాజెక్టు... వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం,ఎమ్మెల్యే
కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచి పోనుంది.తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. సు మారు 50లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు ని ర్మా ణానికి రూ.80 లక్షల కోట్ల నిధులు ఖర్చు చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రాజెక్టు దేశంలోనే ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. రెండు పంటలు పండించుకునే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా దక్కనుంది. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చే స్తున్న సీఎం కేసీఆర్‌ను ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా అభినందిస్తున్నాను. అందుకే నా మద్దతు సీఎం కేసీఆర్‌కే తెలిపాను.

అపరభగీరథుడు సీఎం కేసీఆర్... బానోత్ హరిప్రియ నాయక్, ఇల్లెందు,ఎమ్మెల్యే,
సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టి పేద రైతాంగానికి మళ్లిస్తున్న అపర భగీరథేడు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా భావించి అ హోరాత్రులు శ్రమించి అతి తక్కువ కాలంలో పూర్తి చేసేందుకు చొరవ చూ పిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతాంగం జన్మజన్మలకు రుణపడి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిని స్వయంగా ముఖ్యమంత్రి డిజైన్ చేసి అనతి కాలంలోనే ఆచరణలోకి తెచ్చారు. చరిత్రలోనే నిలిచిపోయే బహుళార్ధక సాధక ప్రాజెక్టు కాళేశ్వరం. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శం:లావుడ్యా రాములునాయక్, వైరా ఎమ్మెల్యే
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన కాళే శ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఆదర్శం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టు లపై ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రా జెక్టును నిర్మించి సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం పేరు ప్రఖ్యాతలు సాధించింది. కేసీఆర్ ఆలోచన, సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం బంగారు పంటల భూ మిగా మారనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న సా హసోపేత నిర్ణయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

బంగారు తెలంగాణ స్వాప్నికుడు సీఎం కేసీఆర్...
60 ఏళ్లు అ రిగోస పడిన తె లంగాణ ప్ర జ లను సమైక్య పాలకుల నుం చి విముక్తి క ల్పించి బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు తెలం గాణ ప్రజలు ఎప్ప టికీ రుణపడి ఉంటారు. ప్రారం భించిన అతి తక్కు వ కాలంలోనే పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ఇంజనీరింగ్ అద్భుతమే. రూ.80 వేల కోట్లకు పైగా కేంద్రం నిధులు రాకున్నా రాష్ట్రమే నిధులను సమకూర్చుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం సంతోషదాయకం. తెలంగాణ రైతాంగం సీఎం కేసీఆర్‌కు ఎన్నటికీ రుణపడి ఉంటుంది.

బీడు భూములు సస్యశామలమవుతాయి..వాడవాడలా పండుగ జరపాలి: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
పెనుబల్లి: అతి తక్కువ సమయంలో భారీ ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ర్టానికి అపర భగీరథుడిగా కేసీఆర్ పేరొందారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఎంపీపీ ఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభం జరుగుతుందని, ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరపాలని, పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగాలన్నారు. గత పాలనలో శిలాఫలాకాలు వేసి దోచుకున్నారే తప్ప పథకాలు పూర్తి చేసిన దాఖలాలు లేవని, కాని ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వర పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు పట్టుదలతో పూర్తి చేశారని, ఒక ఇంజనీర్‌లా, రైతులా, బాధ్యత కలిగిన ఉద్యమనాయకుడిగా కాళేశ్వర ప్రాజెక్టుకు తన మేధాశక్తిని ఉపయోగించి పట్టుదలతో పూర్తి చేసిన ఘనత ఆయనదేనన్నారు. తెలంగాణ బీడుభూములన్నీ సస్యశ్యామలం కావడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి జిల్లా వరప్రదాయని సీతారామ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ఎంపీపీ చీకటి బేబి శకుంతల రామారావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, మండల ఉపాధ్యక్షురాలు నరుకుళ్ళ కస్తూరి, నాయకులు చీకటి రామారావు, కనగాల వెంకటరావు, కర్నాటి వీరభద్రారెడ్డి, కనగాల సురేష్, బొర్రా వెంకటేశ్వర్లు, తావూ నాయక్, బండి రాఘవులు, గువ్వల వెంకటరెడ్డి, కాకా సీతారాములు, వంగా గిరిజాపతి, దాము, ఆచంటి శ్రీను, తాళ్ళూరి శేఖర్‌రావు, వేముల కృష్ణయ్య, ఏట్కూరి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

అత్యద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం...కోరం కనకయ్య జెడ్పీ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం
అతి తక్కువ సమయంలోనే పూర్తైన అత్యద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి ప్రా జెక్టును నిర్మించలేదు. అనుకున్నదే తడవుగా ప్రాజెక్టుకు అం కురార్పణ చేసి బీడువారిన భూములను సస్యశ్యా మలం చేస్తూ రైతుల పక్షపాతిగా, రైతుబాంధవుడిగా నిలిచారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే ఇది ఇంజనీరింగ్ అద్భుతం. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు డిజైన్ చేయడంలో అహోరాత్రులు శ్రమించి తన పర్యవేక్షణలో నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు. అదే విధంగా జిల్లా ప్రజలందరూ తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భాన ప్రతీ ఊళ్లో సంబురాలు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారు..లింగాల కమల్‌రాజ్ , జడ్పీచైర్మన్ ఖమ్మం
తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. ప్రజల హృదయాల్లో మరో అవతార పురు షుడిగా కేసీఆర్ నిలిచిపోతారు. బీడు భూములలోకి గోదావరి జలాలను తరలించిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ర్టాన్ని, దేశాన్ని ఎంతో మందిరి పాలించారు. ఏ ఒక్కనాయకుడు కూడా నీరులేని భూ ములకు నీటిని పారించిన వారు లేరు. గోదావరి నది నుంచి ప్రతి ఏడాది లక్షల క్యూసెకుల నీరు సముద్రంలోకి వృథాగా పోతుంది. దీనిని గమనించిన కేసీఆర్ గోదావరి జలాలను తెలంగాణ భూములకు తరలించాలనే లక్ష్యంతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం ఒక అద్భుతం. ముఖ్యమంత్రి మాత్రం మూడేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధారణమైన విషయం కాదు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles