గీత దాటితే వేటు తప్పదు

Fri,June 21, 2019 02:05 AM

-నిబంధనలకు అనుగుణంగానే విక్రయాలు జరగాలి
-గడువు తీరిన రకాలను అంటగడతే కఠిన చర్యలు తప్పవు
-ఫెర్టిలైజర్స్ డీలర్ల సమావేశంలో జేడీఏ ఝాన్సీలక్ష్మీకుమారి
ఖమ్మం వ్యవసాయం, జూన్ 20 : నిబంధనలకు లోబడి మాత్రమే విత్తనాల, ఎరువుల విక్రయాలు జరగాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మీకుమారి సూచించారు. నిబంధనలను పాటించని డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో విత్తనా, ఎరువుల డీలర్లకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జేడీఏ మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం అయిన నేపథ్యంలో డీలర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు రైతులకు విక్రయించే క్రమంలో అవసరమైన లాట్ ఐడీలతో కూడిన రసీదులు అందివ్వాలన్నారు. బీటీ-3 హెచ్‌వన్ కాటన్ పత్తి విత్తనాల విక్రయాలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే విధంగా కాలం చెల్లిన (గడువు తీరిన) విత్తనాలు, ఎరువులను కూడా షాపులలో ఉంచవద్దని సూచించారు. ఆయా షాపుల నిర్వాహకులు, డీలర్లు స్టాక్ రిజిస్టర్లను విధిగా రాయాలని సూచించారు.

ఎప్పటికప్పుడు స్టాక్ వివరాలను షాపులలో ఉంచిన బోర్డులలో ప్రదర్శించాలని సూచించారు. కలుపుమందుకు సంబంధించి ప్రస్తుతం ైగ్లెఫోసెట్ మందును నిలుపుదల చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని డీలర్లు సహకరించాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించి వారి మన్ననలను చురగొనాలని అన్నారు. నాసిరకం, నకిలీ విత్తనాలు అన్నదాతలకు అంటగట్టి సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విత్తనాల విక్రయాల ప్రక్రియ జోరుగా సాగుతోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూసేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని అన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ సహాయ సంచాలకులు వీ.శ్రీనివాసరెడ్డి, బీ.సరితలు క్రయ విక్రయాల నిర్వహణనై అవసరమైన మేర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసనాయక్, అర్బన్ మండల వ్యవసాయశాఖ అధికారి బీ.కిషోర్‌బాబు, డీలర్ల అసోసియేషన్ బాధ్యులు మహేందర్, మురళి, రవి, సత్యం పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles