కాళేశ్వరం సంబురాలు అంబరాన్నంటాలి

Fri,June 21, 2019 02:03 AM

వైరా, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా యుద్ధప్రాతిపదికన నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలు శుక్రవారం అంబరాన్నంటే విధంగా సంబురాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు కృషి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతాంగ అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రారంభోత్సవం సంబరాలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ 64వ జన్మదిన వేడుకలను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, నాయకులు సూతకాని జైపాల్, మిట్టపల్లి నాగి, చింతనిప్పు సుధాకర్, తన్నీరు నాగేశ్వరరావు, అయిలూరి మోహన్‌రెడ్డి, యరమల రవీంద్రరెడ్డి, గూడూరు రామశేషారెడ్డి, పర్సా రవి, తుమ్మల చిన్ని, మోదుగు లక్ష్మయ్య, బొగ్గుల వాసురెడ్డి, మర్సకట్ల రవి, అంబడిపూడి మురళి, బండారు తిరుపతిరావు, వుయ్యూరి నాగేశ్వరరావు, నోచిన వీరబాబు, సంపసాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles