బుగ్గవాగు ప్రాజెక్టుకు నిధులు విడుదల

Fri,June 21, 2019 02:03 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక కృషి, చొరవ కారణంగా కారేపల్లి మండలంలో నిర్మించే బుగ్గవాగు ప్రాజెక్టుకు రూ.39.21 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో నెం.248ని గురువారం సాయంత్ర విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎమ్మెల్యే అజయ్‌గత కొన్ని రోజులుగా కృషి చేస్తున్నారు. బుగ్గవాగు ప్రాజెక్టు వలన కారేపల్లి, రఘునాథపాలెం మండలంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రెండు మండలాల్లోని రైతులకు సాగునీరు లేక గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే పువ్వాడ ప్రత్యేక కృషి పెట్టి నిధులు రాబట్టేల కృషి చేశారు. కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామం వద్ద బుగ్గవాగుపై ఇప్పటికే చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. అక్కడ నుంచి కాలువలను నిర్మించి గ్రావిటీ ద్వారా రఘునాథపాలెం మండలంలోని 14చెరువులను, కారేపల్లి మండలంలోని 18 చెరువులను నింపేలా కాలువల నిర్మాణం జరగనుంది. వర్షకాలం సీజన్‌లో వరద వచ్చిన సమయంలో బుగ్గవాగు నుంచి ప్రవహించే నీరు వృథాగా మున్నేరులో కలవకుండా ఉండేందుకు ఇప్పటికే విశ్వనాథపల్లి వద్ద చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేసినందున త్వరలోనే కాలువల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు 22కిలోమిటర్ల పొడువున కాలువలను నిర్మించాల్సి ఉంది. దీనికి గాను 220 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రఘునాథపాలెం, కారేపల్లి మండలంలోని 2500ల ఎకరాల ఆయకట్టు స్థీరికరణ జరుగుతుంది. ఎమ్మెల్యే పువ్వాడ ప్రత్యేక కృషి ద్వారా బుగ్గవాగు నిర్మాణానికి నిధులు విడుదల కావడంతో రెండు మండలాలోని రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles