మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

Thu,June 20, 2019 01:16 AM

-కలెక్టర్ రజత్ కుమార్ శైనీ
అన్నపురెడ్డిపల్లి: రానున్న జూలై నెలఖరు నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు మరుగుదొడ్లు నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ రజత్ కుమార్ శైనీ ఆదేశించారు. బుధవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించి మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. మండలంలో మరుగుదొడ్లు నిర్మాణాలు, ఉపాధి హామి పనుల తీరు, నర్సరీలలో మొక్కల పెంపకం వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మరుగుదొడ్లు నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాలను పూర్తి చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండ క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పక్రియను పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో తరుచూ సమావేశాలు నిర్వహించి పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించాలన్నారు. నూటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మాణాలను పూర్తి చేసి ఓడీఎఫ్ మండలంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles