ఘనంగా రామయ్య నిత్యకల్యాణం

Thu,June 20, 2019 01:15 AM

భద్రాచలం టెంపుల్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తదుపరి గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం, నివేదన తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles