కేసీఆర్‌ చిత్రపటానికి ఉప సర్పంచ్‌ల క్షీరాభిషేకం

Wed,June 19, 2019 01:18 AM

పాల్వంచ రూరల్‌ : ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ హోదా కల్పించినందుకు కృతజ్ఞతగా మం డలంలో ని వివిధ పంచాయతీల సర్పంచ్‌లు ముఖ్యమం త్రి కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. మండలంలోని వివిధ పంచాయితీల నుంచి వచ్చిన ఉప సర్పంచ్‌లు పాల్వంచ పట్టణంలో అమరవీరుల స్తూపానికి, తెలంగాణతల్లి విగ్రహాలకు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు వేముల రాజశేఖర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలోని పంచాయతీల్లో గతంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవని, ప్రస్తుతం ఆ అభివృద్ధికై జరిగే ప్రతీ పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉప సర్పంచ్‌లను కూడా భాగస్వాములను చేసి జాయింట్‌ చెక్‌పవర్‌ హోదా కల్పించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మాళోతు గాంధీ, లగడపాటి రమేష్‌, కొంగర అప్పారావు, కొండలరావు, ఎలిక వెంకటరావు, గుగులోతు చిరంజీవి, పాటి వీరభద్రం, గుండు రవి, నాగార్జున, ఉండ్రాతి మణెమ్మ పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles