కోదండ రామునికి విశేష పూజలు

Wed,June 19, 2019 01:17 AM

ఇల్లెందు రూరల్‌ : మండలంలోని సుభాష్‌నగర్‌ రామాలయం రజతోత్సవ పూజా కార్యక్రమాలు రెండో రోజైన మంగళవారం వైభవంగా నిర్వహించారు. రజతోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా భద్రాద్రి రామాలయం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు సతీసమేతంగా హాజరయ్యారు. ఆయనకు కోదండరామాలయం పూజారులు, ఆలయ కమిటీ, స్థానిక భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆహ్వానం పలికారు. ఆలయంలో జగన్నాధాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి రామాలయం నుంచి తెచ్చిన ముత్యాలను సుభాష్‌నగర్‌ రామాలయంకు బహుకరించారు. అనంతరం రజతోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సముద్రాల పరంకుశమాచార్యులు, యాజ్ఞికులు మరిగంటి అరుణకుమారచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శిఖరం, మూల విరాట్‌ అభిషేకం, కళశ పూజ చేపట్టారు. 19న నిత్యహోమాదులు, శాంతి కల్యాణం, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, రుత్వికసన్మానం కొనసాగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా జగన్నాధచార్యులను కోదండరామాలయ పూజారులు, ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్యక్షుడు కొల్లిపాక శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles