బడి బాటను విజయవంతం చేయాలి

Wed,June 12, 2019 12:02 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్: బడి బాట, హరితహారం జయప్రదం చేయాలని జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. వీటిపై ఆయన బుధవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... బడి బాట కార్యక్రమం ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందన్నారు. వీటిని డీఈవో, ఎంఈవోలు విజయవంతం చేయాలన్నారు. బడి మధ్యలో మానేసిన పిల్లలను బడి బాట పట్టించేందుకు రోజువారీ కార్యక్రమాలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై, చర్చించేందుకు ప్రధానోపాధ్యాయులతో ఎంఈఓలు సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోలేని విద్యార్థుల వద్దకు వెళ్లి, హాసళ్లలో చేర్పించాలని చెప్పారు. బడి బాట కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని గమనిస్తూ చేయాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. హరితహారంలో ఎవరికి ఎన్ని మొక్కలు కావాలనేది నివేదికలు ఇవ్వాలని కోరారు. డీఈవో వాసంతి, ఎంఈవోలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles