సీఎం కేసీఆర్‌ను కలిసిన నూతన జడ్పీచైర్మన్‌లు

Wed,June 12, 2019 12:02 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన కోరం కనకయ్య మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో కలిసి పనిచేస్తానని అన్నారు. సీఎంను కలిసిన వారిలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పడిదల నవీన్‌కుమార్ ఉన్నారు.
ఖమ్మం, నమస్తే తెలంగాణ : హైద్రాబాద్ ప్రగతి భవన్‌లో కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రత్యేక సమావేశం, విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదిర్శి తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర, గాయత్రీ రవి
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మంగళవారం హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు గాయత్రీ రవి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలకు కేంద్రం నుంచి ఎన్వీరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవానిని సీఎం కేసీఆర్‌కు వినతిప్రతం అందజేశారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles